2024 IPL Inauguration Ceremony: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ ఎడిషన్ ఆరంభ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సాయంత్రం 6:30 నిమిషాలకు ఈ వేడుక ప్రారంభమైంది. కళ్ళు మిర మెట్ల గొలుపే లైటింగ్ తో చిదంబర స్టేడియం పగలే వెన్నెల దర్శనమిచ్చింది. ఈ ఈవెంట్ లో ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ పురస్కార గ్రహీత ఏఆర్ రెహమాన్, ప్రసిద్ధ గాయకుడు సోను నిగం, బాలీవుడ్ యాక్టర్లు అక్షయ్ కుమార్, టైగర్ జాకీష్రాఫ్ పాల్గొన్నారు. సోనూనిగం తన ఆటపాటలతో ప్రేక్షకులను అలరించాడు. అనంతరం ప్రఖ్యాత సంగీత దర్శకుడు అద్భుతమైన పాటలు పాడి అలరించాడు. ముఖ్యంగా ఆయన సంగీత దర్శకత్వంలో రూపొంది, ఆస్కార్ అవార్డు దక్కించుకున్న స్లాం డాగ్ మిలియనీర్ సినిమాలోని జయహో పాట ప్రేక్షకులను అలరించింది. బిగిల్ సినిమాలోని సింగపన్నై, ఇంకా చాలా హిట్ సినిమాల పాటలను రెహమాన్ ఆలపించారు. రెహమాన్ తన పాటలను ఆలపిస్తుంటే స్టేడియంలోని ప్రేక్షకులు కోరస్ పాడారు.
ఇక బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి సూపర్ హిట్ పాటలకు డ్యాన్స్ చేశారు. రెహమాన్, సోను నిగం కూడా వేదికపై స్టెప్పులు వేశారు. అసలే హై వోల్టేజ్ మ్యాచ్ కావడం.. దానికి లబ్ద ప్రతిష్టులైన వ్యక్తుల పెర్ఫార్మెన్స్ తోడు కావడంతో స్టేడియంలోని ఆడియన్స్ ఊగిపోయారు. చిదంబరం స్టేడియం మొత్తం అభిమానుల ఈలలు, గోలలతో సందడిగా మారింది. మొత్తానికి తొలి మ్యాచ్ ద్వారా ఐపిఎల్ అభిమానులకు బీసీసీఐ డబుల్ ట్రీట్ ఇచ్చింది.
వేడుకల అనంతరం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఇటీవల పార్లమెంట్ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఐపీఎల్ బోర్డు కేవలం 21 మ్యాచ్ ల షెడ్యూల్ ను మాత్రమే వెల్లడించింది. రెండవ విడత షెడ్యూల్ ను త్వరలో ప్రకటిస్తామని ఐపీఎల్ నిర్వాహక కమిటీ తెరిపింది. తగ ఈ మ్యాచ్ కి సంబంధించి జియో సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్ లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక బ్రాడ్ కాస్టింగ్ చి స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ ప్రారంభ వేడుకలకు ఐపిఎల్ నిర్వహణ కమిటీ ఏఆర్ రెహమాన్ , సోనునిగం, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కు దాదాపు ఏడు నుంచి పది కోట్ల వరకు చెల్లించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే వారికి అంత మొత్తం కంటే ఎక్కువనే చెల్లించి ఉంటారని.. అందుకే లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా వీరికి ఇచ్చిన రెమ్యునరేషన్ తో శ్రీ విష్ణు తో ఒక స్మాల్ స్కేల్ బడ్జెట్ సినిమా తీయవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
The M.A. Chidambaram stadium is ready to host the #TATAIPL 2024 opener
⏰ 8 PM IST
https://t.co/4n69KTTxCB
Official IPL App#CSKvRCB pic.twitter.com/bGz3DDdh4h— IndianPremierLeague (@IPL) March 22, 2024