Lokesh CM Chandrababu Sensational Comments : నారా లోకేష్ కు( Nara Lokesh ) ప్రమోషన్ ఖాయమా? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారా? లేకుంటే ఏకంగా జాతీయ అధ్యక్ష పదవి ఇస్తారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో అదే చర్చ నడుస్తోంది. మహానాడు వేదికగా కీలక ప్రకటన ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. లోకేష్ కు ప్రమోషన్ కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు జిల్లాల నుంచి తీర్మానాలు చేసి పంపాయి. మహానాడు వేదికగా ప్రకటనే తరువాయి అన్నట్టు పరిస్థితి ఉండేది. అయితే మహానాడులో అటువంటి ప్రకటన రాలేదు. దీంతో పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశలో మునిగిపోయాయి. అయితే ఇప్పుడు లోకేష్ భవిష్యత్తుపై ఆయన తండ్రి, సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నర్మగర్భంగా మాట్లాడారు.
* పార్టీలో విస్తృతమైన చర్చ..
చంద్రబాబు( CM Chandrababu) ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. పార్టీలో ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నిస్తారు. పార్టీలో ఎటువంటి వ్యతిరేకత రాకుండా చూసుకుంటారు. లోకేష్ విషయంలో కూడా చంద్రబాబు ఆలోచన అదే. లోకేష్ విషయంలో పార్టీ శ్రేణుల నుంచి అభ్యంతరాలు ఉండేవి. ఆయన నాయకత్వం పై అప నమ్మకం ఎక్కువగా ఉండేది. కానీ వాటన్నింటినీ అధిగమించి తనను తాను ప్రూవ్ చేసుకున్నారు నారా లోకేష్. అయితే ఆ పరిస్థితిని అనుకూలంగా మార్చింది మాత్రం చంద్రబాబు. తండ్రి నుంచి సహనం, మంచి లక్షణాలను అలవరచుకున్నారు నారా లోకేష్. మరోవైపు పార్టీ శ్రేణుల అభిమానాన్ని కూడా చూరగొంటున్నారు. పార్టీలో పదవితో సంబంధం లేకుండా.. టిడిపిని ఒంటి చేత్తో నడిపిస్తున్నారు నారా లోకేష్.
Also Read: ప్రతినెలా 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
* మహానాడులో ప్రకటన
మొన్నటి మహానాడులో( mahanadu ) లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ పార్టీ శ్రేణుల నుంచి విపరీతంగా వినిపించింది. ఇప్పుడు కాకుంటే ఎప్పుడు అని ఎక్కువమంది సీనియర్లు కూడా తమ అభిప్రాయాన్ని బయటపెట్టారు. పార్టీలో విస్తృత చర్చ జరగాలని.. అందరి ఆమోదంతోనే లోకేష్ కు పార్టీ బాధ్యతలు అప్పగించాలన్నది చంద్రబాబు అభిప్రాయం. అందుకే మహానాడు వేదికగా ఆ ప్రకటనకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. కుటుంబం నుంచి కూడా ఎటువంటి అభ్యంతరాలు లేవు. లోకేష్ కు పోటీ కూడా లేదు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా లోకేష్ టీం తయారవుతోంది. చంద్రబాబు మాదిరిగానే నమ్మకస్తులైన యువ నేతలు లోకేష్ చుట్టూ ఇప్పుడు ఉన్నారు. అందుకే పార్టీ పగ్గాలు ముందుగా అప్పగించాలన్న డిమాండ్ వచ్చింది. అయితే పార్టీ శ్రేణులతో పాటు ప్రజల్లో బలమైన చర్చ నడిచింది. ఈ విషయంలో చంద్రబాబు వ్యూహం వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది.
* చంద్రబాబు స్పందించారు అలా..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. లోకేష్ కు ముఖ్యమంత్రి( chief minister) పదవి అని ప్రశ్న రాగా చంద్రబాబు తనదైన రీతిలో స్పందించారు. అందుకు చాలా సమయం ఉందని మాట్లాడారు. నాయకుడిగా తన ముద్ర చాటుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కష్టపడి పని చేస్తే తప్పకుండా అనుకున్నది సాధించగలరని కూడా అభిప్రాయపడ్డారు. పార్టీలో లోకేష్ పాత్రను గుర్తు చేసేలా చంద్రబాబు వ్యాఖ్యానాలు సాగాయి. ఈ విషయంలో నేరుగా స్పష్టత ఇవ్వకపోయినా.. కష్టపడి పని చేయడం ద్వారా భవిష్యత్తులో లోకేష్ అందరి ఆమోదంతో నాయకత్వ బాధ్యతలు తీసుకుంటాడని మాత్రం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఆ దిశగా సంకేతాలు ఇచ్చారు.