Chevireddy Arrest: మద్యం కుంభకోణంలో( liquor scam ) చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పట్లో బయటకు వచ్చే ఛాన్స్ లేదా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పక్కాగా సమాచారం ఉందా? అందుకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్థానంలో మరొకరిని నియమించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. కొద్ది రోజుల కిందట మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి నుంచి ముడుపులు రవాణాలో చెవిరెడ్డిదే క్రియాశీలక పాత్ర అని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో తేలింది. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారు.
Also Read: ఆ ఇద్దరు ఫైర్ బ్రాండ్స్ రెడీ.. తేల్చుకోవాల్సింది జగనే!
జగన్ నమ్మిన బంటు..
వాస్తవానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి( Chevireddy Bhaskar Reddy) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తూ వస్తున్నారు. 2014,2019 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఆయనకి గెలిచారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో చెవిరెడ్డికి తప్పకుండా మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. కానీ వివిధ సమీకరణలో భాగంగా ఆయనకు అవకాశం దక్కలేదు. దీంతో జగన్మోహన్ రెడ్డి తుడా చైర్మన్ గా ఆయనకు అవకాశం ఇచ్చారు. అయితే మంత్రి పదవి ఇవ్వలేదు కానీ ఆ స్థాయిలో హోదాను వెలగబెట్టారు చెవిరెడ్డి. అయితే మద్యం కుంభకోణం కేసులో ఆ నలుగురితో పాటు చెవిరెడ్డి పేరు కూడా బయటకు వచ్చింది. మద్యం కంపెనీల నుంచి ముడుపులు స్వీకరించి.. వాటిని తుడా వాహనాల ద్వారా ఏపీవ్యాప్తంగా సరఫరా చేశారన్నది ప్రధాన ఆరోపణ. అందుకే ఇప్పుడు చెవిరెడ్డి చుట్టూ బలమైన ఉచ్చు బిగిసింది. దీంతో ఆయన ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.
Also Read: ఆదివారం అమరావతిలో ఏం జరిగింది?
ఎన్నారై నేతకు బాధ్యతలు
సందట్లో సడే మియా అన్నట్టు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాధ్యతలను వేరే నేతకు అప్పగించింది. దీంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది. వాస్తవానికి 2024 సార్వత్రిక ఎన్నికల్లో( general elections ) చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవాలని భావించారు. తన బదులు చంద్రగిరి నియోజకవర్గ టికెట్ ను తన కొడుకు మోహిత్ రెడ్డికి ఇవ్వాలని కోరారు. తాను తాడేపల్లి లో ఉంటూ అనుబంధ విభాగాల బాధ్యతను చూసుకుంటానని చెప్పుకొచ్చారు. అయితే ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి చివరి నిమిషంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలోకి వెళ్లిపోయారు. దీంతో అక్కడ బలమైన అభ్యర్థి అవసరం కావడంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రంగంలోకి దించారు జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ఫలితాలు వచ్చాక అదే భాస్కర్ రెడ్డికి వైయస్సార్ కాంగ్రెస్ అనుబంధ విభాగాల బాధ్యతలను ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చాలా యాక్టివ్ గా పని చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అయితే ఇప్పుడు ఆ బాధ్యతలను ఒక ఎన్నారై నేతకు అప్పగించడం.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చేవరకు తాత్కాలిక బాధ్యతలు చేపడతారని చెప్పడం.. చూస్తుంటే మాత్రం భాస్కర్ రెడ్డి ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.