Kavitha Is Missing: తన తండ్రిని తెలంగాణ పిత అని చెబుతున్నప్పటికీ.. వారియర్ అని కొనియాతున్నప్పటికీ కల్వకుంట్ల కవితను కెసిఆర్ దగ్గరికి రానివ్వడం లేదు. ఇదేమి బ్లండర్ గా చేస్తున్న ఆరోపణ కాదు. జరుగుతున్న పరిస్థితులు, సంఘటనలు అలానే ఉన్నాయి. లేఖల లికుల తర్వాత కవిత బాపును కలిసింది లేదు. మాట్లాడిందీ లేదు. కాలేశ్వరం కమిషన్ ఎదుటకు విచారణకు హాజరవుతుంటే ఎర్రవల్లి వెళ్లిన కవితకు కేసిఆర్ దర్శన భాగ్యం దక్కినప్పటికీ.. మాట్లాడే అవకాశం రాలేదు. పైగా ముందుకు వెళ్లిపోవాలంటూ కేసిఆర్ సంకేతాలు మాత్రమే ఇచ్చారు. ఒక్క మాట కూడా జాగృతి అధినేత్రి తో మాట్లాడలేదు ఒక రకంగా కూతురుగా ఆమెకు ఇది గర్వభంగం. అయినప్పటికీ ఈరోజుకు కూడా తన తండ్రే తనకు హీరో అని చెబుతుంది కవిత.. అంతే కాదు పార్టీ అధ్యక్ష స్థానంలో ఆయనను తప్ప మరొకరిని ఊహించుకోలేనని చెబుతుంది. తన అన్నను పార్టీ అధ్యక్షుడిగా పరిగణించలేనని.. ఆయన ఆధ్వర్యంలో పనిచేయలేనని స్పష్టం చేసింది కూడా..
ఓ రాములు నాయక్, విజయశాంతి, ఆలె నరేంద్ర, ఈటెల రాజేందర్.. ఇలా ఎంతోమంది కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారు. పార్టీ నుంచి అత్యంత అవమానకరంగా బయటకు వెళ్లిపోయారు.. పార్టీ లైన్ దాటి మాట్లాడిన తన కూతురు కవితను కూడా పక్కన పెట్టారు. పార్టీ సమావేశాలలో కవిత కనిపించడం లేదు. చివరికి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు స్థానం నుంచి కూడా కవిత తొలగింపునకు గురైంది. ఒక ముక్కలో చెప్పాలంటే కెసిఆర్ కుటుంబం నుంచి కవితకు ఎటువంటి సపోర్టు లభించడం లేదు.. కవిత కూడా జాగృతి ఆధ్వర్యంలోనే కార్యక్రమాలను నిర్వహిస్తోంది..
Also Read: వి6 వెలుగు అంటే ఎంపీ ధర్మపురి అరవింద్ కు అంత కోపం ఎందుకు?
తాజాగా తన సోదరుడు కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు నాడు కూడా కవిత తన నివాసానికే పరిమితమైపోయింది. సామాజిక మాధ్యమాల వేదికగా కల్వకుంట్ల తారక రామారావుకు ముక్తసరిగా శుభాకాంక్షలు తెలియజేసింది. తన తండ్రి దగ్గరనుంచి ఆశీస్సులు అందుకోవడానికి సతీ సమేతంగా ఎరవల్లి వెళ్లిన గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు.. కొడుకు హిమాన్షు, భార్య శైలిమతో కలసి తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నాడు.. కెసిఆర్ ను గులాబీ దళపతి ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు.. అంటే తన వారసుడిగా కేటీఆర్ మాత్రమేనని.. ఇంకొకరు ఆస్థానానికి అర్హులు కాదని కెసిఆర్ సంకేతాలు ఇచ్చారా? అనే ప్రస్తుతం ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. ఏతా వాతా చెప్పొచ్చేది ఏంటంటే.. పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుందని.. మాట్లాడే అవకాశం అందరికీ లభిస్తుందని చెప్పే కవితకు.. ఆ ప్రజాస్వామ్యమే తన తండ్రి పార్టీలో లేకపోవడం విశేషం.