Liquor scam in AP : ఏపీలో మద్యం కుంభకోణం( liquor scam ) ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టులు కూడా జరిగాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రెండుసార్లు విచారణకు హాజరయ్యారు వైసిపి మాజీ నేత విజయసాయిరెడ్డి. ఈరోజు మరోసారి ప్రత్యేక దర్యాప్తు బృందం ముందుకు రానున్నారు. అయితే విజయసాయిరెడ్డి మళ్ళీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని ప్రచారం నేపథ్యంలో.. ఆయన సిట్ ముందుకు విచారణకు హాజరవుతుండడం సంచలనంగా మారింది. కొద్ది నెలల కిందట విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కూటమి కేసులు పెడుతుంది అన్న భయంతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే జగన్ చుట్టూ ఉన్న కోటరి తీరు నచ్చక తాను పార్టీకి గుడ్ బై చెప్పానని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి పై ఒక్క ఆరోపణ కూడా చేయనని.. ఆయనకు నష్టం చేకూర్చే పనిని చేయదలుచుకోలేదని తేల్చి చెప్పారు. అయితే ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో ఆయన విచారణకు హాజరవుతుండడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : అమరావతి విషయంలో చంద్రబాబుకు పవన్ గట్టి షాక్
మద్యం కుంభకోణం పై కామెంట్స్..
అయితే గతంలో ఓ కేసు విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ) సంచలన ఆరోపణలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని అర్థం వచ్చేలా మాట్లాడారు. అయితే దానికి ముమ్మాటికి సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని తేల్చి చెప్పారు. ఈ కేసుకు తగిన ఆధారాలు తాను ఇస్తానని స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. దీంతో గతంలో రెండుసార్లు ఆయనకు విచారణకు పిలిచింది ప్రత్యేక దర్యాప్తు బృందం. అయితే రాజకీయంగా మనసు మార్చుకున్నట్లు విజయసాయిరెడ్డి పై ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే సీట్ ఎదుట ఆయన విచారణకు హాజరు కావడం విశేషం. అసలు ఈ కేసులో విజయసాయిరెడ్డి పేరును కూడా నిందితుడిగా చేర్చారు. కానీ ఇప్పుడు నోటీసు ఇచ్చి పిలిచింది సాక్షిగానేనని తెలుస్తోంది. దీంతో ఈ వివాదం మరో మలుపు తిరిగినట్లు అయింది. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి వ్యవహారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలవరం పుట్టిస్తోంది.
తనంతట తానుగా సహకారం..
ఈ ఏడాది జనవరిలో పార్టీకి దూరమయ్యారు విజయసాయిరెడ్డి. అధినేత జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy)విదేశాల్లో ఉండగా పార్టీకి గుడ్ బై చెప్పారు. అధినేత చుట్టూ కోటరి ఉందంటూ విమర్శలు చేశారు. కాకినాడ సిపోర్టు వాటాల బదిలీ కేసులో విచారణకు హాజరయ్యే క్రమంలో సంచలన కామెంట్స్ చేశారు విజయసాయిరెడ్డి. ఆ కామెంట్స్ తర్వాతనే ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడు పెంచింది. అరెస్టులను ప్రారంభించింది. అయితే ఈ కేసులో ఏ 5 నిందితుడిగా ఉన్న విజయసాయి రెడ్డిని మాత్రం ఇంతవరకు టచ్ చేయలేదు. ఇప్పటివరకు రెండు సార్లు విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఆయన విచారణకు హాజరవుతున్నారు. దర్యాప్తునకు సహకరిస్తుండడంతోనే విజయసాయి అరెస్టు జరగలేదని తెలుస్తోంది. కానీ ఈ పరిణామాలు మద్యం కుంభకోణంలో ఉన్న నిందితులలో ఒక రకమైన ఆందోళనకు కారణం అవుతున్నాయి.
Also Read: వైసీపీలోకి టిడిపి సీనియర్ ఎమ్మెల్యే.. ఫుల్ క్లారిటీ!
చంద్రబాబు హామీతో..
వాస్తవానికి ప్రత్యేక దర్యాప్తు బృందానికి విజయసాయిరెడ్డి మంచి ఆఫర్ ఇచ్చారు. కుంభకోణంలో జరిగిన విషయాలన్నింటినీ చెప్పేస్తానని చెప్పుకొచ్చారు. అలానే గత రెండుసార్లు ఎన్నో విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే సిట్ ఆయనను సాక్షి కోణంలోనే పిలిచినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు నుంచి సరైన హామీ లభిస్తే మొత్తం గుట్టు విప్పేస్తారని కూడా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే మద్యం కుంభకోణంలో కీలక నేత ఇరుక్కోవడం ఖాయం. మరి విజయసాయిరెడ్డి ఎలాంటి ఆధారాలు.. నోరు విప్పుతారో చూడాలి.