Chandrababu Naidu Viral News: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) రంగంలోకి దిగారు. తుఫాన్ నష్టాన్ని తెలుసుకునేందుకు ఫీల్డ్ లోకి దిగారు. తుఫాన్ తీరం దాటే వరకు రియల్ టైంలో అధికారులను, యంత్రాంగాన్ని పర్యవేక్షించారు. తుఫాన్ తీరం దాటి వెళ్లిపోయిన వెంటనే క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. వర్ష తీవ్రతతో నష్టపోయిన ప్రాంతాలను, బాధిత జిల్లాల్లో ఏరియల్ సర్వే మొదలుపెట్టారు. కోనసీమ జిల్లాల్లో పునరావాస కేంద్రాలకు వెళ్లారు. ముంపు బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కనీస ముందస్తు సమాచారం లేకుండా చంద్రబాబు ఈ పర్యటనలకు వెళ్లడం విశేషం. తుఫాను రాక మునుపు అప్రమత్తత చర్యలు.. తుఫాను వెళ్ళిపోయాక బాధితులను పరామర్శించడంలో చంద్రబాబు ముందున్నారు.
అర్ధరాత్రి వరకు సచివాలయంలోనే..
ఆగ్నేయ బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం ఏర్పడిందని.. అది తీవ్ర వాయుగుండంగా మారి ఏపీ వైపు దూసుకొస్తుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అది మొదలు సీఎం చంద్రబాబు( CM Chandrababu) సచివాలయంలోని ప్రత్యేక విభాగం నుంచి ఎప్పటికప్పుడు అన్ని జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేశారు. సోమవారం అర్ధరాత్రి 12 గంటల వరకు అక్కడే గడిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేశారు. గత అనుభవాల దృష్ట్యా వెనువెంటనే సహాయ చర్యల కోసం ప్రతి జిల్లాకు కోటి రూపాయలు కేటాయించారు. మిగతా జిల్లాలకు సైతం 50 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేశారు. ముందస్తు అప్రమత్తత చర్యలతో ప్రాణ నష్టం జరగకపోవడం విశేషం.
అధికారులు వద్దన్నా..
మంగళవారం అర్ధరాత్రి వరకు సచివాలయంలోనే( Secretariat) ఉన్నారు సీఎం చంద్రబాబు. 12 గంటల పాటు ఏక ధాటిగా వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించారు. అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. రాత్రి తుఫాన్ తీరం దాటిన తర్వాత.. సచివాలయం నుంచి ఇంటికి చేరుకున్నారు చంద్రబాబు. అయితే మంత్రి నారా లోకేష్ మాత్రం రాత్రంతా సచివాలయంలోనే గడపడం విశేషం. తుఫాన్ ఈరోజు తీరం దాటింది కానీ వర్షాలు మాత్రం కొనసాగుతూ వచ్చాయి. హెలిక్యాప్టర్ పర్యటన అంత మంచిది కాదని చెప్పినా చంద్రబాబు వినలేదు. క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. ఏరియల్ సర్వే చేశారు. నేరుగా బాధితులతో మాట్లాడారు. బాధితులకు నిత్యవసర సరుకులు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు ఇవ్వాలని ప్రత్యేక జీవో కూడా జారీ చేశారు. మొత్తానికి అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్లో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు సీఎం చంద్రబాబు.