Google setup in AP : ఆంధ్రప్రదేశ్ కు( Andhra Pradesh) గుడ్ న్యూస్. ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ ఏపీకి రాబోతోంది. ఈ మేరకు గూగుల్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా అమరావతిలో గూగుల్ ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించింది. దీనికి సంబంధించి స్థల పరిశీలన జరుగుతోంది. నెక్కల్లులో స్థలాన్ని గూగుల్ ప్రతినిధులు పరిశీలించారు. దగ్గర్లో విమానాశ్రయం, రైల్వే స్టేషన్ ఉండడంతో ఆ స్థలం పై ఆసక్తి చూపుతున్నారు. గూగుల్ సంస్థ ప్రతినిధులు ప్రభుత్వంతో ఉన్నత స్థాయిలో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సిఆర్డిఏ అధికారులతో కలిపి గూగుల్ ప్రతినిధులు స్థల పరిశీలన జరిపారు. గూగుల్ ఏపీలో ఎంట్రీ ఇవ్వాలన్న నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది. అయితే అది అమరావతిలో కీలక ప్రాజెక్టు చేపట్టడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అందుకే నెక్కల్లులో 8 రోడ్డు పక్కన 143 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని గూగుల్ సంస్థకు కేటాయించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
* మంత్రి లోకేష్ చొరవతో..
కొద్ది రోజుల కిందట గూగుల్ సీఈఓ ను( Google CEO) మంత్రి లోకేష్ బృందం కలిసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు గూగుల్ ప్రతినిధులు అమరావతికి వచ్చి ప్రభుత్వంతో కీలక చర్చలు జరుపుతున్నారు. ఏపీలో గూగుల్ విస్తరణ జరిగితే మాత్రం ప్రత్యక్షంగా వేల మందికి, పరోక్షంగా లక్షలాదిమందికి ఉద్యోగ ఉపాధి మార్గాలు దొరికే అవకాశం ఉంది. అందుకే విదేశాల్లో పర్యటించినప్పుడు మంత్రి లోకేష్ గూగుల్ సంస్థ ప్రతినిధులను కలిశారు. ఏపీలో పెట్టుబడుల కోసం ఆహ్వానించారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలా ప్రోత్సాహం ఉంటుందని చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే అమరావతిలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Also Read : ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ.. కూటమి సర్కార్ సంచలన నిర్ణయం!
* చాలా రాష్ట్రాలు ప్రయత్నించినా..
ప్రపంచ దిగ్గజ సంస్థగా గూగుల్ కు మంచి పేరు ఉంది. గూగుల్ కోసం దేశంలో చాలా రాష్ట్రాలు ప్రయత్నించాయి. అయితే గతంలో మైక్రోసాఫ్ట్ ( Microsoft) వంటి దిగ్గజ సంస్థలను తెలుగు రాష్ట్రాలకు రప్పించిన చరిత్ర చంద్రబాబుది. అదే స్ఫూర్తితో ఆయన తనయుడు నారా లోకేష్ రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఆయన ఏపీ పాఠశాల విద్యాశాఖ తో పాటు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. అందుకే వీలైనంతవరకు ఐటీ సంస్థలను ఏపీకి రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖను ఐటి హబ్ గా మార్చాలన్నది కూటమి ప్రభుత్వ ధ్యేయం. అదే సమయంలో అమరావతిలో సైతం సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థల కార్యకలాపాలు కొనసాగేలా చూడాలన్నది ఒక ప్రణాళిక. అందులో భాగంగానే గూగుల్ సంస్థకు అమరావతిలో భూముల కేటాయించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధపడింది. స్థల పరిశీలన సైతం కొలిక్కి వచ్చింది. అయితే చర్చలు సానుకూలంగా ముగిసిన వెంటనే.. గూగుల్ తన కార్యకలాపాలను అమరావతి నుంచి మొదలుపెట్టే అవకాశం ఉంది.