Kuppam School Controversy: కుప్పం నియోజకవర్గంలో వరుస ఘటనలు నివ్వెర పరుస్తున్నాయి. మొన్నటికి మొన్న భర్త అప్పు తీసుకున్న పాపానికి భార్యను చెట్టుకు కట్టేశారు. దుర్భాషలాడుతూ దారుణంగా అవమానించారు. పిల్లలు గుక్కె పట్టుకొని ఏడుస్తున్నా వారు వినలేదు. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం స్పందించింది. నిందితులపై కేసు నమోదు చేసింది. బాధిత కుటుంబాన్ని ఆదుకుంది. అది మరువక ముందే మరో టిడిపి నేత భూ కబ్జా అంటూ ఆరోపణలు వచ్చాయి. తాజాగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలతో పారిశుధ్య పనులు చేయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోసారి కుప్పం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా నిలిచింది.
Also Read: Jagan Car police Report: జగన్ పై కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు
కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని బైరు గాని పల్లి ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఆ పాఠశాలలో స్వీపర్లు పనిచేస్తున్నారు. అయితే విద్యార్థులతో పారిశుద్ధ్య పనులు చేయించడం పై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో విద్యార్థుల బతుకు విలువ ఇదేనా? అంటూ మాజీ మంత్రి ఆర్ కే రోజా ట్వీట్ చేశారు. చదువు నేర్పించాల్సిన చోట కూలీ పనులా? ఇది విద్యాలయమా? లేక శిక్ష శిబిరమా? నారా లోకేష్. పేద పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఎప్పటికైనా విద్యాశాఖ పై దృష్టి పెట్టండి అంటూ రోజా హితవు పలికారు.
Also Read: Kiraak RP Comments On Roja: రోజాపై మళ్లీ రెచ్చిపోయిన కిర్రాక్ ఆర్పీ.. వైరల్ వీడియో
అయితే ఈ ఘటనపై టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కావాలనే చిన్న వివాదాన్ని తెరపైకి తెచ్చి చంద్రబాబుపై విషం కక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా జరిగే ఘటనలను సైతం సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేస్తుండడం పై మండిపడుతున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కుప్పం నియోజకవర్గ విషయంలో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడం మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఎప్పటికప్పుడు జరిగిన ఘటనలపై ప్రభుత్వం శరవేగంగా స్పందిస్తోంది. అయితే పాఠశాలల్లో జరిగే సాధారణ అంశాలను తీసుకుని వివాదాస్పదం చేస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది.
చిత్తూరు – కుప్పంలో..
ముఖ్యమంత్రి @ncbn గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో… విద్యార్థుల బతుకు విలువ ఇదేనా?
స్వీపర్లు ఉన్నా, బైరుగానపల్లి స్కూల్లో ఉపాధ్యాయులే విద్యార్థులతో చెత్త ఎత్తిస్తున్నారు!
తల్లిదండ్రుల ఆవేదన: “చదువు నేర్పించాల్సిన చోట కూలీ పనులా?”ఇది విద్యాలయమా?… pic.twitter.com/X6KvLxtzSp
— Roja Selvamani (@RojaSelvamaniRK) June 27, 2025