Kuppam Mother Tied Incident: ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu) సొంత నియోజకవర్గంలో దారుణం చోటుచేసుకుంది. అప్పు తీర్చలేదని చెప్పి ఓ మహిళను చెట్టుకు కట్టేసి వేధించారు. తల్లిని చెట్టుకు కట్టేస్తుంటే ఆమె పిల్లలు గుక్క పట్టి ఏడవడం అందర్నీ కదిలిస్తోంది. నీ భర్త వచ్చి అప్పు డబ్బులు తిరిగి చెల్లించి.. నిన్ను విడిపించుకోవాలి. లేకపోతే నీ సంగతి చూస్తాం అంటూ ఆమెను సాటి మహిళలు సైతం కర్రలతో దాడి చేసి కొట్టడం సంచలనంగా మారింది. ఈ అవమానవీయ ఘటన సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో జరగడం విమర్శలకు తావిస్తోంది. తోటి మహిళలే.. సాటి మహిళ అని చూడకుండా.. పిల్లలు గుక్క పట్టి ఏడ్చుతున్న కనికరం లేకుండా వ్యవహరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై నెటిజెన్లు భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
Shocking ! In CM #ChandrababuNaidu‘s own constituency Kuppam an alleged #TDP worker tied a 25-year-old woman to a tree and publicly humiliated her over an unpaid loan of ₹80,000. Victim Sirisha has been raising her two children on her own since her husband abandoned them. After… pic.twitter.com/UI0Xft63Lh
— Ashish (@KP_Aashish) June 17, 2025
భర్త అప్పు తీర్చకపోవడంతో..
కుప్పం( Kuppam ) మండలం నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప, శిరీష దంపతులు. భర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన ముని కన్నప్ప వద్ద మూడు సంవత్సరాల కిందట 80 వేల రూపాయల అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చాలని ఒత్తిడి పెరగడం తో తిమ్మరాయప్ప మనస్థాపంతో ఊరిని వదిలేసి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఊర్లో భార్య శిరీష ఇద్దరు పిల్లలు ఉన్నారు. తిమ్మరాయప్ప చేసిన అప్పులను కూలి పనులు చేస్తూ తీరుస్తోంది శిరీష. ఆపై మిగిలిన సొమ్ముతో పిల్లలను పోషిస్తోంది. అయితే ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తుండగా సకాలంలో అప్పు ఎందుకు చెల్లించడం లేదంటూ శిరీషపై అసభ్యంగా ప్రవర్తించారు ముని కన్నప్ప కుటుంబ సభ్యులు. తన అప్పు డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ముని కన్నప్ప బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా శిరీషను బలవంతంగా తీసుకెళ్లి వేపచెట్టుకు తాడుతో కట్టేశాడు. దీంతో అక్కడున్న ఇతర కుటుంబ సభ్యులు శిరీష పై దాడి చేయడం కనిపించింది. తల్లిని కట్టేసి కొడుతుండడంతో పిల్లలు ఇద్దరు బోరున విలపించారు. అయినా వారు కనికరించలేదు.
Also Read: Kuppam: కుప్పంలో ఘర్షణ.. రణరంగం.. మాజీ మంత్రి అరెస్ట్
సోషల్ మీడియాలో షేర్..
అయితే అక్కడ ఉన్నవారు ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో( social media) షేర్ చేశారు. శిరీష పరిస్థితిని చూసి అందరూ బాధపడ్డారు. ఇది పోలీస్ అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు సీరియస్గా స్పందించారు. తక్షణం రంగంలోకి దిగి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కావడంతో.. ఈ ఘటన విపరీతంగా వైరల్ అయింది. ముఖ్యమంత్రి కార్యాలయం సైతం ఆరా తీసినట్లు తెలుస్తోంది. అయితే రుణ యాప్ లు, ప్రైవేటు వ్యాపారుల ఆగడాలు పెచ్చు మీరుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కాగా ఈ వీడియోను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వైరల్ చేస్తోంది.