Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ కేసులో సాక్షిగా ఆయన తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. 2023 నవంబరులో శాసనసభ ఎన్నికల సమయంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నందున అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తన ఫోన్ ను ట్యాప్ చేసిందని గతంలో మహేశ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసుల సూచన మేరకు జూబ్లీహిల్స్ పీఎస్ లో విచారణకు ఆయన హాజరయ్యారు.