Homeఆంధ్రప్రదేశ్‌Krishna District : నేనే సాయం చేయలేనబ్బా.. తాగుబోతులకు స్పష్టం చేసిన నారా లోకేష్

Krishna District : నేనే సాయం చేయలేనబ్బా.. తాగుబోతులకు స్పష్టం చేసిన నారా లోకేష్

Krishna District  : ఏపీలో ( Andhra Pradesh)నేర నియంత్రణపై దృష్టి పెట్టింది పోలీస్ శాఖ. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా రాత్రిపూట నేరాలపై నిఘా పెట్టింది. రాత్రి 11 గంటల తరువాత అకారణంగా రహదారులపై తిరిగిన చర్యలకు ఉపక్రమిస్తుంది. సరైన కారణాలు చూపెడితే కేసులు పెట్టేందుకు కూడా వెనుకడుగు వేయడం లేదు. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖ ముమ్మర తనిఖీలు చేపడుతూ వస్తోంది. ముఖ్యంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతోంది. మద్యం తాగి వాహనాన్ని నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసుల సంఖ్య పెరుగుతోంది.

Also Read : డైరెక్టర్ అట్లీ తనకు తాను రాజమౌళి ని మించిన డైరెక్టర్ అనుకుంటున్నాడా?

* పెరిగిన డ్రోన్ల వినియోగం..
గత కొద్దిరోజులుగా పోలీస్ శాఖలో( police department) డ్రోన్ల వినియోగం పెరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం, గంజాయి, మత్తు పదార్థాలు సేవిస్తున్న వారిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది పోలీస్ శాఖ. ఇటువంటి వారి కోసం డ్రోన్ కెమెరాలను వినియోగిస్తోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మందుబాబులు పట్టుబడుతున్నారు. కృష్ణాజిల్లా గుడివాడ పరిధిలో ఉన్న ఓ ఇంజినీరింగ్ కాలేజీ వెనుక బహిరంగ ప్రదేశాల్లో కొంతమంది యువకులు మద్యం సేవిస్తున్నారు. అటువంటివారిని డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించారు.

* సోషల్ మీడియాలో వైరల్..
అయితే అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో( social media) వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఆ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులు కూడా నమోదు చేశారు. అయితే ఆ యువకులు మద్యం తాగుతుండగా.. డ్రోన్స్ ని చూసి వారిచ్చిన రియాక్షన్ కామెడీగా మారాయి. ఆ వీడియోకి మన్మధుడు సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జోడించారు. ఆ వీడియోను కృష్ణా జిల్లా పోలీస్ శాఖ ట్విట్టర్ ద్వారా పంచుకుంది. అయితే ఆ పోస్ట్ పై స్పందించారు మంత్రి నారా లోకేష్. ఆసక్తికర కామెంట్స్ చేశారు. పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్న వారిని చూస్తే జాలేస్తోంది. సారీ గైస్.. నేను మీకు ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నా.. ఎందుకంటే ఏపీ పోలీసులు వారి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు అని రాసుకొచ్చారు. మంత్రి లోకేష్ చేసిన ఈ సెటైరికల్ ట్విట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read : పవన్ కళ్యాణ్ మీకు ఇది తగునా?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version