Homeఆంధ్రప్రదేశ్‌ Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మీకు ఇది తగునా?

 Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మీకు ఇది తగునా?

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan) కాన్వాయ్ పుణ్యమా అని కొంతమంది విద్యార్థులు విలువైన పరీక్షకు దూరమయ్యారు. వారి తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. ఈరోజు ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనకు వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్ట్ లో దిగిన పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో అరకు వెళ్లారు. అయితే పవన్ కాన్వాయ్ అడ్డం గా రావడంతో కొంతమంది విద్యార్థులు చాలాసేపు రోడ్డు పక్కన ఉండిపోవాల్సి వచ్చింది. వారంతా జేఈఈ మెయిన్స్ పరీక్ష రాయాల్సి ఉంది. పరీక్షకు ఆలస్యంగా వెళ్లడంతో అక్కడి అధికారులు అనుమతించలేదు. ప్రభుత్వ యంత్రాంగం చేసిన ఓ చిన్న తప్పుతో విద్యార్థులు జేఈఈ పరీక్షలకు దూరం కావాల్సి వచ్చింది. దీంతో ఈ ఏడాది జై మెయిన్స్ పరీక్షల కోసం సిద్ధపడిన విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారింది. విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Also Read : మావోయిస్టుల అడ్డాకు పవన్… రెండు రోజుల పాటు ఆ ప్రాంతాల్లోనే!

* అదే మార్గం గుండా కాన్వాయ్..
పెందుర్తిలో ( Pendurthi) ఆయాన్ డిజిటల్ కేంద్రంలో జేఈఈ మెయిన్స్ పరీక్ష సోమవారం ఉదయం 8:30 గంటలకు ప్రారంభమైంది. నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు వచ్చారు. అయితే పవన్ మన్యంలో పర్యటనకు రోడ్డు మార్గం గుండా బయలుదేరారు. పెందుర్తి మీదుగా కాన్వాయ్ వెళ్లేందుకు నిర్ణయించారు. అయితే అదే సమయానికి పరీక్ష జరగనుంది. డిప్యూటీ సీఎం పర్యటన కావడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన పోలీస్ భద్రత మధ్య ఆయన పర్యటన కొనసాగింది. దీంతో కొద్దిసేపు పోలీసులు ట్రాఫిక్ ను నిలిపివేశారు. దీంతో పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు విద్యార్థులకు ఆటంకం ఏర్పడింది.

* సరిగ్గా పరీక్ష సమయానికి..
అయితే ఉదయం 8:30 గంటలకు వెళ్లాల్సిన విద్యార్థులు.. కేవలం రెండు నిమిషాలు ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి( exam centre ) చేరుకున్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ మూలంగా తలెత్తిన ట్రాఫిక్ ఇబ్బందులతోనే తాము రాలేకపోయామని.. కేవలం రెండు నిమిషాలు పాటు ఆలస్యం అయ్యామని.. దయచేసి పరీక్ష రాసేందుకు అవకాశం ఇవ్వాలని వారు అధికారులను కోరారు. అయినా సరే అధికారులు అనుమతించలేదు. ఓ 30 మంది విద్యార్థుల వరకు పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా జేఈఈ పరీక్షలు రాయలేకపోయారు.

* తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం..
అయితే అధికారులు అనుమతించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు( parents ) ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. కన్నీటి పర్యంతమయ్యారు. జేఈఈ పరీక్షల్లో తమ పిల్లలు ఉత్తీర్ణత సాధిస్తారని.. మంచి భవిష్యత్తు ఉంటుందని నెలల తరబడి కలలు కన్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తీవ్ర నిరాశ ఎదురయింది. ఈ సమస్యకు పరిష్కారం కనుచూపుమేరలో కూడా లేకపోవడంతో ఎక్కువమంది తల్లిదండ్రులు అక్కడే రోదించడం కనిపించింది. పరీక్ష దృష్ట్యా పోలీసులు ముందుగా ఏమాత్రం ఆలోచన చేసి ఉన్నా ఆ 30 మంది విద్యార్థులు పరీక్ష రాసేవారు. కేవలం పోలీసుల నిర్లక్ష్యం మూలంగానే 30 మంది పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారని అక్కడున్న వారు చెబుతున్నారు.

Also Read : ఏపీ సిఐడికి సుప్రీం కోర్ట్ షాక్!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version