Homeఆంధ్రప్రదేశ్‌Kota Srinivasa Rao's Political Career: ఆ రెండు కులాలకు కాదని.. బెజవాడ ఎమ్మెల్యేగా కోటా...

Kota Srinivasa Rao’s Political Career: ఆ రెండు కులాలకు కాదని.. బెజవాడ ఎమ్మెల్యేగా కోటా శ్రీనివాసరావు ను ఎందుకు చేశారు?!

Kota Srinivasa Rao’s Political Career: విలక్షణ నటుడుగా సినీ రంగంలో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు దివంగత కోటా శ్రీనివాసరావు( Kota Srinivasa Rao ). దాదాపు 700కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. విపరీతమైన విలనిజం చూపించారు. అదే సమయంలో కామెడీ టైమింగ్ తో పాత్రలో పరకాయ ప్రవేశం చేసేవారు. కోటా శ్రీనివాసరావు అందరి నటులతో నటించారు. పాత్రలకు జీవం పోశారు. అయితే అన్నింటికీ మించి ఆయన విజయవాడ రాజకీయాల్లో ప్రవేశించడం.. ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం మాత్రం సంచలనమే. విజయవాడ అంటే సం’కుల’ సమరం. పైగా కమ్యూనిస్టులతో పాటు కాంగ్రెస్ భావజాలం అధికం. అటువంటి చోట బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి గెలవడం అనేది సంచలనమే. తన సినీ గ్లామర్ కు తోడు టిడిపి బలం జత కావడంతో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఐదేళ్లపాటు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా కొనసాగారు.

వాజ్పేయి విధానాలకు ఆకర్షితుడై..
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి( Atal Bihari Vajpayee) విధానాలకు ఆకర్షితుడై బిజెపిలో చేరారు కోటా శ్రీనివాసరావు. తెలంగాణ బిజెపి నేత విద్యాసాగర్ రావు చొరవతో భారతీయ జనతా పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. 1999లో అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు చంద్రబాబు. పొత్తులో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని బిజెపి కి కేటాయించారు. అయితే ఆ నియోజకవర్గంలో కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పార్టీలు గెలుస్తూ వచ్చాయి. బిజెపి భావజాలానికి ఆ నియోజకవర్గం వ్యతిరేకం. ఆపై అక్కడ కమ్మ, కాపు సామాజిక వర్గ ప్రాబల్యం అధికం. కానీ కోటా శ్రీనివాసరావు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దీంతో కోట శ్రీనివాసరావు ఓడిపోవడం ఖాయమని విశ్లేషణలు వచ్చాయి. పదివేల ఓట్లకు మించి రావని కూడా చాలామంది విశ్లేషించారు.

గట్టి ప్రత్యర్థి పై..
ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఐలాపురం వెంకయ్య( ilapuram venkaiah ) పోటీ చేశారు. విజయవాడ రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్ ఉన్న నేత ఆయన. దీంతో ఆయన చేతిలో కోటా శ్రీనివాసరావుకు ఓటమి తప్పదని అంతా భావించారు. సామాజిక వర్గ ప్రాబల్యంతో అక్కడ కోటా శ్రీనివాసరావుకు గెలుపు అనేది అసాధ్యమని మీడియాలో విశ్లేషణలు వచ్చాయి. తనకున్న సినీ ఇమేజ్తో కేవలం పదివేల ఓట్లు మాత్రమే వస్తాయని కూడా కొన్ని మీడియా సంస్థలు బాహాటంగా ప్రకటించాయి. కానీ వారందరి అంచనాలను తలకిందులు చేస్తూ కోటా శ్రీనివాసరావు అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. 6 వేలకు పైగా ఓట్లతో మెజారిటీ సాధించారు. ఆ ఎన్నికల్లో కోటా శ్రీనివాసరావుకు 57,047 ఓట్లు వచ్చాయి. ఐలాపురం వెంకయ్యకు 50 వేల 971 ఓట్లు వచ్చాయి. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు కోటా శ్రీనివాసరావు.

బ్రాహ్మణుల నుంచి తొలిసారి..
1951 నుంచి జరిగిన ఎన్నికల్లో విజయవాడ( Vijayawada) నుంచి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం తొలిసారి. ఆ ఘనత సాధించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు. ముఖ్యంగా అప్పట్లో సత్యనారాయణపురం బ్రాహ్మణులు ఎన్నికల్లో శ్రమించారు. ప్రత్యేకంగా కృషి చేయడంతో కోటా శ్రీనివాసరావు గెలిచారు. అదే స్ఫూర్తితో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణు వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పటికీ బెజవాడ రాజకీయాల్లో కోటా శ్రీనివాసరావు పేరు వినిపిస్తూనే ఉంటుంది. కేవలం ఐదేళ్ల ఎమ్మెల్యే పదవి చేసి తనకంటూ ఒక విలక్షణ చాటుకున్నారు కోట శ్రీనివాసరావు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular