Hari Hara Veeramallu Pre Release Event: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓవర్సీస్ లోని పలు ప్రాంతాల్లో మొదలైంది. నార్త్ అమెరికా లో 800 షోస్ కి గానూ లక్షా 50 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది పవన్ కళ్యాణ్ రేంజ్ కి చాలా తక్కువ అనే చెప్పాలి. చివరి 5 రోజుల్లో అడ్వాన్స్ బుకింగ్స్ భారీ రేంజ్ లోనే ఉంటాయి కానీ, మేకర్స్ అసలు ఈ సినిమా ఈ నెల 24న విడుదల అవుతుంది అని నమ్మకం కలిగించే పనులు ఒక్కటి కూడా చేయడం లేదు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన బయ్యర్స్ ని ఖరారు చేయకపోవడం ఒక ఎత్తు అయితే, మేకర్స్ కనీస స్థాయిలో కూడా ప్రొమోషన్స్ చేయడం లేదు.
Also Read: ఏపీకి కొత్త నేషనల్ హైవే.. ఆ జిల్లాలకు మహర్దశ!
ఈరోజు సెన్సార్ కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు, అది ఎంత వరకు నిజమో చూడాలి. ఇదంతా పక్కన పెడితే అభిమానులంతా ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసమే ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత సినిమాలకు వేరే లెవెల్ లో క్రేజ్ పెరుగుతూ ఉంటుంది. బ్రో వంటి షార్ట్ ఫిలిం రీమేక్ కి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత అంచనాలు వేరే లెవెల్ కి చేరుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు కూడా అదే విధంగా హైప్ క్రియేట్ అవుతుందని బలమైన ఆశతో ఉన్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ముందుగా తిరుపతి లో కానీ, లేదా విజయవాడ లో వాతావరణం ని బట్టి నిర్వహిస్తామని నిర్మాత AM రత్నం రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. కానీ ఇప్పుడు వైజాగ్ లో నిర్వహించాలని అనుకుంటున్నారట.
త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయబోతున్నారు మేకర్స్. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి , లేదా సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిధులుగా వస్తారని ప్రచారం జరిగింది కానీ, అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ప్రాణ మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శక ధీరుడు రాజమౌళి ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా హాజరు అవ్వబోతున్నారట. మరి ఈ చిత్రానికి మొదట్లో దర్శకత్వం వహించిన క్రిష్ జాగర్లమూడి హాజరు అవుతాడో లేదో ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు. ఈ సినిమాకు సంబంధించి ఏ అప్డేట్ లో కూడా క్రిష్ కలగచేసుకోలేదు. సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపిన థియేట్రికల్ ట్రైలర్ విషయం లో కూడా ఆయన మౌనం గానే ఉన్నాడు. ఒకవేళ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాకపోతే సినిమా మీద నెగటివ్ ప్రచారం జరిగే అవకాశం ఉంటుంది.
Chief guests ~ Rajamouli, Trivikram #HHVMPreReleaseEvent#HariHaraVeeraMallu
— ustad (@ustadkalyan) July 13, 2025