Kommineni Media Ethics Debate: సాక్షి టీవీలో ప్రతిరోజు ఉదయం డిబేట్ ను కొమ్మినేని నిర్వహిస్తారు. ఇటీవల ఆయన నిర్వహించిన డిబేట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు(journalist Krishnam Raju) అనే జర్నలిస్టు అమరావతి మహిళల మీద చేసిన వ్యాఖ్యలు పెను ప్రకంపనలు సృష్టించాయి. దీంతో ఈ వ్యవహారం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. తుళ్లూరు మహిళల ఫిర్యాదు మేరకు ముందుగా కొమ్మినేనిని ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్లి అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత కృష్ణంరాజును కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసులో కొమ్మినేని సుప్రీంకోర్టు దాకా వెళ్లారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి తీర్పుతో ఆయనకు బెయిల్ లభించింది. వాస్తవానికి ఆయన శనివారం జైలు నుంచి విడుదల కావలసి ఉన్నప్పటికీ.. వరుస సెలవుల వల్ల అది కాస్త వాయిదా పడింది. చివరికి ఆయన విడుదలైన తర్వాత మళ్లీ సాక్షి టీవీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. బుధవారం నాడు నిర్వహించిన డిబేట్లో శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన విడుదలకు.. సుప్రీంకోర్టులో కేసు విచారణకు జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి రెడ్డి సహకరించారని ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో కన్నీరు పెట్టుకొని భావోద్వేగానికి గురయ్యారు.
కన్నీళ్ళు పెట్టుకున్న KSR గారు
ప్రతి కన్నీటి బొట్టుకు సమాధానం చెప్తాం pic.twitter.com/217pb9nI0r
— (@2029YSJ) June 18, 2025
గుణపాఠం అవుతుందా
ఇటీవల కాలంలో రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు డబ్బా కొట్టే వ్యవస్థగా మీడియా మారిపోయింది. వాస్తవానికి న్యూట్రాలిటీ స్థానంలో ఒక వర్గానికి కొమ్ముకాసే స్థాయికి మీడియా దిగజారిపోయింది. రాజకీయ నాయకులను మించిపోయి మీడియా ప్రతినిధులు వ్యాఖ్యలు చేయడం పరిస్థితి తీవ్రతను తేటతెల్లం చేస్తుంది. ఇందులో సాక్షి అనే కాదు.. చానల్స్, పత్రికల పరిస్థితి ఇదే విధంగా ఉంది. అయితే ప్రస్తుతం సాక్షి వైసిపి మౌత్ పీస్ కాబట్టి.. సహజంగానే అందులో పనిచేసే వారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. వ్యతిరేకంగానే మాట్లాడుతుంటారు. అలాంటప్పుడు సరైన ఆధారాలతో మాట్లాడితే ఇబ్బంది లేదు.
Also Read: Kommineni Bail Behind Reasons: కొమ్మినేనికి బెయిల్.. తెర వెనుక జరిగింది అదే!
అలా కాకుండా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే అధికారంలో ఉన్నవారు ఊరుకోరు కదా. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తమకు వ్యతిరేకంగా వార్తలు ప్రచురించిన సంస్థలను ఇలా ఇబ్బంది పెట్టిందో చూశాం కదా.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అందుకు భిన్నంగా వ్యవహరించడం లేదు. కాకపోతే ఇలాంటి సమయంలోనే కాస్త ప్రతిపక్ష పార్టీ అనుకూల మీడియా సంస్థలలో పనిచేసేవారు జాగ్రత్తగా ఉంటేనే మంచిది. కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్టు.. మీడియాలో ఆయన గురించి విపరీతంగా ప్రచారం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డి స్వయంగా పట్టించుకున్నారు. ఒకవేళ ఆయన స్థానంలో మరొకరు ఉంటే పరిస్థితి ఇలా ఉండేదా? అనే విషయాన్ని అందులో పని చేసేవారు.. ఇక మీడియా సంస్థలలో పనిచేసే వారు కూడా ఆలోచించుకోవాలని సీనియర్ పాత్రికేయులు పేర్కొంటున్నారు. మొత్తంగా కొమ్మినేని ధారావాహికలో జర్నలిస్టులు చాలా నేర్చుకోవాలని సూచిస్తున్నారు.