Homeఆంధ్రప్రదేశ్‌Rayalaseema Political News: రాయలసీమలో ఆ పార్టీకి డేంజర్.. గ్రౌండ్ రిపోర్ట్ ఇదే!

Rayalaseema Political News: రాయలసీమలో ఆ పార్టీకి డేంజర్.. గ్రౌండ్ రిపోర్ట్ ఇదే!

Rayalaseema Political News:  రాయలసీమలో( Rayalaseema ) కూటమి డేంజర్ జోన్ లో ఉందా? అక్కడ కూటమి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరిగిందా? వచ్చే ఎన్నికల్లో వారు గెలవడం కష్టమా? ఇటీవల ఓ సర్వేలో ఇదే అంశాలు వెల్లడయ్యాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే మాత్రం వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి పరిణామాలు. సహజంగానే రాయలసీమ అంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ప్రాంతం. 2014, 2019 ఎన్నికల్లో రాయలసీమలో స్పష్టమైన మెజారిటీ సాధించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారింది. కూటమి దాదాపు స్వీప్ చేసినంత పని చేసింది. కడప జిల్లాలో సైతం ఆ పార్టీకి ఎదురు దెబ్బ తప్పలేదు. కర్నూలు, చిత్తూరు జిల్లాలో రెండేసి స్థానాల్లో సరిపెట్టుకుంది. అయితే మునుపెన్నడూ లేనివిధంగా కూటమి కట్టడంతోనే టిడిపి ఘన విజయం సాధించింది. అయితే అదే పట్టు కొనసాగించాలని చూస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో కూటమి నేతల మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. అవే ప్రతికూలత చూపుతున్నాయి.

కడపలో తగ్గుతున్న గ్రాఫ్..
కడప జిల్లాలో( Kadapa district) కూటమి నేతల మధ్య సమన్వయం లేదు. కడప జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి దూకుడుగా ఉన్నారు. అదే స్థాయిలో ఆ నియోజకవర్గంలో విభేదాలు ఉన్నాయి. ఇక బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సొంత పార్టీ నేతలతో విభేదాలు పెంచుకుంటున్నారు. ముఖ్యంగా ఎంపీ సీఎం రమేష్ తో ఆయనకు విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు స్థానికంగా ఉన్న పరిశ్రమల యాజమాన్యాలకు బెదిరిస్తున్నారు అన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. దీంతో ఆయన తీరుతో రాయలసీమ బిజెపి నేతలు విభేదిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అందుకే కడప జిల్లాలో మొన్నటి గెలుపు శాశ్వతం చేసుకోవడంలో కూటమి వెనుకబడిందన్న ప్రచారం జరుగుతోంది.

Also Read:  Rayalaseema four-lane road : రాయలసీమకు భారీ ప్రాజెక్ట్..రూ.3653 కోట్లతో నాలుగు లైన్ల రోడ్డు!

కొన్ని నియోజకవర్గాల్లో. అనంతపురం( Ananthapuram ) జిల్లాలో పరిస్థితి బాగానే ఉన్నా కొన్ని నియోజకవర్గాల విషయంలో మాత్రం.. పరిస్థితి చేయి దాటుతున్న టాక్ వినిపిస్తోంది. కూటమి నేతల మధ్య ఇక్కడ సమన్వయం లేదు. ఈ పరిస్థితి కారణంగానే కొన్ని నియోజకవర్గాల్లో విభేదాలు బయటకు వస్తున్నాయి. కర్నూలు జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తి ఉంది. చిత్తూరు జిల్లాలో మాత్రం టిడిపి కూటమి సమన్వయంతో ముందుకు సాగుతోంది. ఇక్కడ నేతల మధ్య చిన్న చిన్న అభిప్రాయ బేధాలు తప్ప.. విభేదాలు మాత్రం లేవని తెలుస్తోంది. అయితే కేవలం సమన్వయ లోపంతోనే సర్వేల్లో ప్రతికూల ఫలితాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

జాగ్రత్త పడుకుంటే కష్టమే..
2024 ఎన్నికల్లో రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాల్లో టిడిపి కూటమి( TDP Alliance ) 45 సీట్లను కైవసం చేసుకుంది. 52 సీట్లకు గాను ఏడు అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అంతకుముందు ఎన్నికల్లో ఇక్కడ టిడిపి గెలిచింది కేవలం మూడు స్థానాలు. దానితో పోల్చుకుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మెరుగైన సీట్లే సాధించింది. కానీ ఇప్పుడు సర్వేల్లో టిడిపి కూటమికి వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఈ తరుణంలో టిడిపి కూటమి జాగ్రత్త పడకపోతే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు తప్పవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular