Homeఎంటర్టైన్మెంట్Baahubali Tamannaah Role: బాహుబలిలో తమన్నాగా నటించింది ఆ బిగ్ బాస్ బ్యూటీనా? షాకింగ్ మేటర్...

Baahubali Tamannaah Role: బాహుబలిలో తమన్నాగా నటించింది ఆ బిగ్ బాస్ బ్యూటీనా? షాకింగ్ మేటర్ లీక్

Baahubali Tamannaah Role:  బాహుబలి సిరీస్ లో సెకండ్ హీరోయిన్ గా ప్రాధాన్యత ఉన్న పాత్ర చేసింది తమన్నా. ఆమె రెబల్ లేడీ పాత్రలో నటించి మెప్పించింది. అయితే తమన్నాకు డూప్ గా నటించాను అంటూ షాకింగ్ మేటర్ లీక్ చేసింది బిగ్ బాస్ బ్యూటీ భానుశ్రీ.

దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్ర రాజసం బాహుబలి(BHAHUBALI). ఈ సిరీస్ లో వచ్చిన రెండు చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేశాయి. నయా రికార్డ్స్ సెట్ చేశాయి. బాహుబలి, బాహుబలి 2 చిత్రాల్లో నటించిన ప్రభాస్, రానా, అనుష్క శెట్టి, సత్య రాజ్, రమ్యకృష్ణ, నాజర్ దేశవ్యాప్తంగా పాప్యులర్ అయ్యారు. తమన్నా కీలక రోల్ దక్కించుకుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో తమన్నా పాత్ర ప్రధానంగా సాగుతుంది. భల్లాలదేవ వద్ద బంధీగా ఉన్న దేవసేనను విడిపించేందుకు ప్రయత్నం చేసే రెబల్ గ్రూప్ లేడీ అవంతిక పాత్ర చేసింది తమన్నా(TAMANNAH). గతంలో ఎన్నడూ చేయని పాత్రలో నటించి ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసింది.

అయితే తమన్నా పాత్రకు ఓ బిగ్ బాస్ బ్యూటీ డూప్ గా చేసిందట. బాహుబలి విడుదలై దాదాపు దశాబ్దం అవుతుండగా, ఈ షాకింగ్ మేటర్ తాజాగా వెలుగులోకి వచ్చింది. తమన్నాకు డూప్ గా నటించింది ఎవరో కాదు భానుశ్రీ(BHANU SREE). ఈమె తెలుగులో మర్లపులి, నీకు నాకు మధ్య 18, కుమారి 21 ఎఫ్, బాహుబలి, కాటమరాయుడు చిత్రాల్లో నటించింది. బాహుబలిలో ఒక చిన్న పాత్రలో మెరిసింది. అదే సమయంలో తమన్నాకు డూప్ గా కూడా చేసిందట. ఈ మేరకు ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Also Read:  Actress Tamannah: నెట్టింట వైరల్ అవుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా లేటెస్ట్ పిక్స్…

బహుశ్రీ మాట్లాడుతూ… నాకు తమన్నా డూప్ గా చేయాలంటూ ఆఫర్ వచ్చింది. మొదట నేను ఆ ఆఫర్ తిరస్కరించాను. కానీ పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ ఆశజూపడంతో ఒప్పుకున్నాను. సెట్స్ కి వెళ్ళాక అది బాహుబలి సినిమా అని తెలిసింది. ఏకంగా 17 రోజులు తమన్నా డూప్ గా బాహుబలి చిత్రంలో నటించాను అని భానుశ్రీ చెప్పుకొచ్చింది. భానుశ్రీ తాజా కామెంట్స్ చిత్ర వర్గాల్లో చర్చకు దారి తీశాయి. బాహుబలి సినిమా తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 2లో భానుశ్రీకి ఆఫర్ వచ్చింది. కంటెస్ట్ చేసిన భానుశ్రీ పెద్దగా రాణించలేదు. నాని హోస్ట్ చేసిన ఈ సీజన్ కి విన్నర్ గా కౌశల్ నిలిచాడు. సింగర్ గీతా మాధురి రన్నర్ అయ్యింది.

అనంతరం ఢీ షోలో మెంటర్ గా చేసింది. కొద్ది వారాలకే భానుశ్రీ షో నుండి తప్పుకుంది. అందుకు స్టార్ మాతో ఒప్పందమే అని భానుశ్రీ వెల్లడించింది. స్టార్ మా యాజమాన్యానికి చెప్పే నేను ఢీ షో ఒప్పుకున్నాను. మొదట వాళ్ళు అభ్యంతరం చెప్పలేదు. తర్వాత మీరు వేరే ఛానల్ లో షో చేయడానికి వీలు లేదన్నారు. మీరు అంగీకరిస్తేనే షో చేస్తున్నాను కదా,అని అడిగాను. అగ్రిమెంట్ ప్రకారం మీరు ఇతర ఛానల్ లో షో చేయకూడదని వారు అన్నారు. దాంతో ఢీ నుండి తప్పుకున్నాను అని భానుశ్రీ అన్నారు.

RELATED ARTICLES

Most Popular