Homeఆంధ్రప్రదేశ్‌Kolikapudi Srinivas Rao Controversy: నేనింతే మారనంటున్న కొలికపూడి

Kolikapudi Srinivas Rao Controversy: నేనింతే మారనంటున్న కొలికపూడి

Kolikapudi Srinivas Rao Controversy: తెలుగుదేశం పార్టీ నాయకత్వ హెచ్చరికలను లెక్కచేయడం లేదు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అన్న విషయాన్ని మరిచి తరచు వివాదాలను తెచ్చిపెట్టుకుంటున్నారు. ఎప్పటికప్పుడు హై కమాండ్ హెచ్చరికలు జారీ చేస్తున్నా.. ఆయన పెడచెవిన పెడుతూనే ఉన్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ వాట్సాప్ గ్రూప్ లోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన మెసేజ్ పెట్టడం హాట్ టాపిక్ అవుతోంది. నేను మారను ఇంతే అన్నట్టు ఆయన వ్యవహార శైలి ఉంది.

Also Read: ప్రియుడి కోసం ఏకంగా తల్లినే.. వామ్మో ఇటువంటి కూతురు పుట్టనే కూడదు

* అమరావతి ఉద్యమ నేపథ్యం..
అమరావతి రాజధాని ఉద్యమం నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాసరావును గుర్తించి టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబు. కానీ ఆయన తరచూ గొడవలు చేస్తూనే ఉన్నారు. వివాదాల జోలికి వెళ్తూనే ఉన్నారు. అయితే టిడిపి కూటమిపరంగా ఎటువంటి పరిణామం జరిగిన దానిని రాజకీయ లబ్ధికి వైసిపి ఎలానూ ప్రయత్నిస్తుంది. అయితే కొలికపూడి వ్యవహారం కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు ప్రచారం జరిగింది. తిరువూరు ఎమ్మెల్యే వైసీపీ లైన్లో నడుచుకుంటున్నట్లు కూడా ఆయన వ్యవహార శైలి బట్టి అర్థమవుతోంది. చంద్రబాబు పలుమార్లు పిలిచి మాట్లాడారు. ఎంత మాత్రం ఆయన పద్ధతి మారడం లేదు. దీంతో ఆయన ఒక ఫైనల్ డెసిషన్ కు వచ్చినట్లు తెలుస్తోంది. టిడిపి సైతం ఏదో ఒక నిర్ణయానికి రాక తప్పదు.

* చివరి వరకు వేచి చూసి..
అయితే ఆది నుంచి తిరువూరు ఎమ్మెల్యే వైఖరి అలానే ఉంది. టిడిపి హై కమాండ్ సైతం అదిగో ఇదిగో చర్యలు అంటూ ముందుకు వెళ్తోంది. అయితే అనవసరంగా ఒక ఎమ్మెల్యేను వదులుకోవడం అనే దానికంటే.. ఆయన ఎక్కడ వైసీపీకి ఆయుధంగా మారుతారు అనేది ఒక ఆలోచన. అందుకే కొలికపూడి ఎన్ని రకాల తప్పులు చేస్తున్న చూసి చూడనట్లుగా ఉంది. కానీ ఇకముందు ఉపేక్షించే ఛాన్స్ లేదు అన్నట్టు ఉంది టిడిపిలో. ఎందుకంటే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పళ్ళ శ్రీనివాస్ సైతం చేతులెత్తేశారు. అయితే టిడిపి వ్యవహారం చూస్తుంటే మాత్రం.. పిచ్చికుక్క ముద్ర గుర్తుకొస్తుంది. ఏదైనా కుక్కను చంపాలంటే దానిపై పిచ్చికుక్క అనే ముద్ర వేయాలి. రాజకీయాల్లో ఈ ఫార్ములాను ఎక్కువ మంది అనుసరిస్తారు. వీలైనంత ఎక్కువ తప్పులు చేయడం ద్వారా కొలికపూడి శ్రీనివాసరావుకు వివాదాస్పద ముద్ర వేయించి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అన్నది ఒక ఆలోచనగా తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే కాక మునుపు కొలికపూడికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. దానిని గుర్తించి చంద్రబాబు పిలిచి మరి టిక్కెట్ ఇచ్చారు. కానీ అధినేత నమ్మకాన్ని మాత్రం నిలబెట్టుకోలేకపోయారు కొలికపూడి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper