Kodali Nani
Kodali Nani: గుడివాడ నియోజకవర్గం (gudivada assembly constancy) లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కొడాలి నాని(Kodali Nani) అంత యాక్టివ్ గా లేరు. పైగా నాని అనారోగ్యానికి గురయ్యారు.. రాజకీయాలకు దూరంగా ఉంటారని ప్రచారం జరిగింది. అయితే ఇన్ని రోజులకు కొడాలి నాని బయటికి వచ్చారు.. తన స్నేహితుడు వల్లభనేని వంశీని ఇటీవల ఏపీ పోలీసులు హైదరాబాద్లోని రాయదుర్గం ప్రాంతంలో అరెస్టు చేసిన నేపథ్యంలో.. మంగళవారం విజయవాడ సబ్ జైల్లో పరామర్శించారు.
వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా పరామర్శించారు. ఈ క్రమంలో సబ్ జైలు ఎదుట కొడాలి నాని ఉండగా.. ఆయనను ఓ మహిళా రిపోర్టర్ ప్రశ్నించారు.. ఈ సందర్భంగా కొడాలి నాని తన పంచ్ లతో మహిళా జర్నలిస్టుకు చుక్కలు చూపించారు..”కొడాలి నాని గారు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారు.. అసలు ఏమైపోయారు” అని ఆ మహిళా రిపోర్టర్ ప్రశ్నించగా..” మీ ఇంటి అడ్రస్ నాకు తెలిసి ఉంటే రోజు వచ్చేవాడిని.. వచ్చి కనపడేవాడినని ” కొడాలి నాని సమాధానం చెప్పారు. ” వల్లభనేని వంశీ అరెస్టును ఎలా చూస్తారని” మహిళా రిపోర్టర్ ప్రశ్నించగా..” అరెస్టు లాగానే చూస్తాను” అని కొడాలి నాని బదులిచ్చారు. “వల్లభనేని వంశీ తర్వాత అరెస్టు అయ్యేది మీరే అని వార్తలు వినిపిస్తున్నాయి..రెడ్ బుక్ లో మీ పేరు కూడా ఉందట కదా” అని మహిళా రిపోర్టర్ ప్రశ్నించగా.. ” రెడ్ బుక్కు ఎలా ఉంటుందో నాకు తెలియదు.. పోనీ మీరు ఏమైనా చూశారా.. మీకు ఏమైనా నన్ను అరెస్టు చేస్తానని చెప్పారా” అని కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. ” కొద్ది రోజులుగా మీరు రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు.. ఎందుకు అలా అయిపోయారు” అని ఆ మహిళా రిపోర్టర్ ప్రశ్నించగా.. ” నీకు ఉద్యోగం పోతుంది.. అప్పుడు ఇలా మైక్ పట్టుకుని బయటికి రాగలుగుతావా.. ధైర్యంగా ప్రశ్నించగలుగుతావా.. రాజకీయాల్లో యాక్టివ్ గా లేనని అంటున్నావు కాబట్టి.. వేమూరి రాధాకృష్ణకు, బీఆర్ నాయుడుకు, నీకు కనబడి వెళ్తాను. ఇప్పుడు మా ఉద్యోగాలు పోయాయి.. కాబట్టి ఇంకేం మాట్లాడతాం. గతంలో ప్రభుత్వం మాది కాబట్టి యాక్టివ్ గా మాట్లాడమని” కొడాలి నాని ఆ మహిళా రిపోర్టర్ తో వ్యాఖ్యానించారు.
అరెస్టులు చిన్న విషయాలు
వైసిపి నాయకుల అరెస్టులపై మహిళా రిపోర్టర్ ప్రశ్నించగా..” మూడు కాపోతే 30 కేసులు పెట్టుకోమని చెప్పండి.. ఈ అరెస్టులు చాలా చిన్న విషయాలు. రేపటినాడు మా ప్రభుత్వం కూడా వస్తుంది. దానికి తగ్గట్టుగానే మా రియాక్షన్ కూడా ఉంటుంది. ఇక రెడ్ బుక్ నేను చూడలేదు. ఇందులో నా పేరు ఉందో ఏదో తెలియదు. పోనీ నీకు ఏమైనా లోకేష్ చెప్పాడా.. అందులో నా పేరు ఉందా” అని కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత కొడాలి నాని మీడియా ముందుకు వచ్చారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని మీడియా ముందు చాలా ఆగ్రహంగా మాట్లాడేవారు. మొహమాటం లేకుండా అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసేవారు. కొన్ని విషయాలు అయితే చెప్పే తీరు కాకుండా మాట్లాడేవారు. అయితే ఇప్పుడు కొడాలి నాని అదే స్థాయిలో మీడియా ముందు మాట్లాడారు. ఒకప్పటి తన ఫైర్ చూపించారు. మొత్తానికి ఆ మహిళా రిపోర్టర్ కు చుక్కలు చూపించారు. కొడాలి నాని అంటే మినిమం ఉంటది అని నిరూపించారు. కొడాలి నాని మాట్లాడిన మాటలను వైసీపీ నేతలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.. ఇది కొడాలి నాని అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బిగ్ టీవీతో మాజీ మంత్రి కొడాలి నాని
గతంలో ప్రభుత్వం మాది కాబట్టి యాక్టివ్గా మాట్లాడాం
ఇప్పుడు మా ఉద్యోగాలు పోయాయి.. ఇంకేం మాట్లాడతాం?
మూడు కాకపోతే 30 కేసులు పెట్టుకోండి
ఈ అరెస్టులు ఇవన్నీ చాలా చిన్న విషయాలు
రెడ్ బుక్ నేను చూడలేదు.. అందులో నా పేరు ఉందో లేదో తెలియదు
– మాజీ… pic.twitter.com/0uvHZf0E6C
— BIG TV Breaking News (@bigtvtelugu) February 18, 2025