Kodali Nani entry Gudivada: గత కొద్దిరోజులుగా మాజీమంత్రి కొడాలి నాని ( Kodali Nani )వార్తల్లో నిలుస్తూ వచ్చారు. మొన్న ఆ మధ్యన కొడాలి నానిని కలకత్తా ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆయనపై నమోదైన కేసుల దృష్ట్యా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ తరుణంలో ఆయన కలకత్తా ఎయిర్ పోర్ట్ నుంచి విదేశాలకు వెళ్తున్నారని ప్రచారం జరిగింది. రోజంతా హడావిడి నడిచింది. చివరకు అటువంటిదేమీ లేదని పోలీసులు ప్రకటించాల్సి వచ్చింది. ఈ తరుణంలో కొడాలి నాని గుడివాడలో సడన్ ఎంట్రీ ఇచ్చారు. ఓడిపోయిన తర్వాత తొలిసారిగా నియోజకవర్గానికి వచ్చారు. దీంతో భారీగా పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. ఓ కోర్టు కేసు నిమిత్తం ఆయన గుడివాడ వచ్చారు. అయితే షర్ట్ కు భారీ బెల్ట్ కట్టుకొని కనిపించడం విశేషం.
Also Read: Kodali Nani Arrest News Today: కోల్ కత్తా టు కొలంబో.. కొడాలి నాని అరెస్ట్!?
దాడి కేసుకు సంబంధించి..
గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు( Ravi Venkateshwara ) పై దాడి కేసులో కొడాలి నాని నిందితుడు. గుడివాడ కోర్టులో ఆ కేసు విచారణ జరిగింది. దీంతో కొడాలి నాని హాజరు తప్పనిసరిగా మారింది. అయితే ఆయనకు ముందస్తు బెయిల్ లభించింది. అరెస్టు భయంతో నాని ముందస్తు బెయిల్ కోసం గుడివాడ కోర్టులో దరఖాస్తు చేసుకోగా.. కొన్ని షరతులతో బెయిల్ మంజూరు అయింది. ప్రతివారం రెండుసార్లు పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకం చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ప్రతి మంగళవారం, శనివారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 లోపు గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. అంటే ఇకనుంచి కొడాలి నాని గుడివాడ నియోజకవర్గానికి రెగ్యులర్ గా రావాల్సిందన్నమాట.
ఛాతికి ప్రత్యేక బెల్ట్
కోర్టుకు హాజరైన కొడాలి నాని చాతికి బెల్టు ( special belt)పెట్టుకుని రావడం అందరి దృష్టికి ఆకర్షించింది. కొద్ది రోజుల కిందట గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు బైపాస్ సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఉన్నత వైద్యం కోసం ఆయన అమెరికా వెళ్తారని కూడా ప్రచారం నడిచింది. ఈ తరుణంలోనే లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. అయితే ఇప్పుడు ఆయన బెల్టుతో కనిపించడం మాత్రం ఆందోళన కలిగిస్తుంది. కానీ డాక్టర్ల సలహా మేరకు ఆయన ఆ బెల్టు ధరించినట్లు తెలుస్తోంది. కొడాలి నాని ధరించిన బెల్టుకు ఒక మిషన్ కూడా ఉంది. అది గుండెకు సంబంధించి మానిటర్ చేసే యంత్రంగా చెబుతున్నారు. కొడాలి నాని కోర్టు మంచి బయటకు వచ్చిన క్రమంలో అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కొద్దిసేపు మాట్లాడారు. తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయారు.
Also Read: Kodali Nani Attend Wedding: పెళ్లి వేడుకల్లో కొడాలి నాని.. వీడియోలు వైరల్!
తొలిసారిగా గుడివాడకు..
అయితే ఎన్నికల ఫలితాల తర్వాత కొడాలి నాని గుడివాడ( Gudivada) నియోజకవర్గానికి వచ్చింది లేదు. తొలిసారిగా ఆయన బయటకు కనిపించడంతో పొలిటికల్ వర్గాల్లో ఒక చర్చ మొదలైంది. కొడాలి నాని కోర్టుకు హాజరైన తర్వాత మళ్లీ హైదరాబాద్ బయలుదేరి వెళ్లిపోయారు. కోర్టు దగ్గర నాని కనిపించడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. నానిని ఎవరు కలుస్తున్నారు అన్నది నిగా పెట్టినట్లు తెలుస్తోంది. 2022లో టిడిపి గుడివాడ ఇన్చార్జిగా ఉన్న రావి వెంకటేశ్వరరావు పై దాడి జరిగింది. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో మాత్రం ఆశించిన పురోగతి లేదు. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు విచారణ ప్రారంభం అయింది. ఈ కేసులో అరెస్టు చేస్తారని భావించి కొడాలి నాని ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు.
ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు హాజరైన కొడాలి నాని | Kodali Nani Bail Petition In Gudivada Court | Prime9 News#kodalinani #AndhraPradesh #YCP #gudivadacourt pic.twitter.com/adCVa8LPRi
— Prime9News (@prime9news) June 27, 2025