Kodali Nani Arrest News Today: ఆంధ్రప్రదేశ్లో( Andhra Pradesh) రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తోంది కూటమి ప్రభుత్వం. కేసులతో ఆ పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మద్యం కుంభకోణం కేసులో ఇప్పుడు కీలక అరెస్టులు జరిగాయి. మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి మరో కేసులో అరెస్టు అయ్యారు. ఇంకోవైపు వల్లభనేని వంశీ మోహన్ రిమాండ్ కొనసాగుతోంది. తాజాగా బెంగళూరు విమానాశ్రయంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మాజీ మంత్రి కొడాలి నానిని కోల్కత్తాలో అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొడాలి నాని పై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఏపీ పోలీసులు కోల్కత్త విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఫోకస్
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన వెంటనే కొడాలి నాని పై ఫుల్ ఫోకస్ పెట్టింది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు మోపుతూ కేసులు నమోదు చేసింది. దీంతో కొడాలి నాని ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించారు. అటు తరువాత అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. ముంబైలోని ఏషియన్ హార్ట్ సెంటర్లో ఆయనకు గుండెకు సంబంధించి బైపాస్ సర్జరీ కూడా జరిగింది. అయితే కొద్ది రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న ఆయన కోలుకున్నారు. రోజువారి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఆయన అమెరికా వెళ్తారని ఆ మధ్యన ప్రచారం సాగింది. ఉన్నత వైద్యం కోసం వెళ్తారని టాక్ నడిచింది. ఈ తరుణంలో ఏపీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
Also Read: Amaravati capital project update: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్!
లుక్ అవుట్ నోటీసులు జారీ..
కొద్ది రోజుల కిందట హైదరాబాదులో( Hyderabad) సన్నిహిత కుటుంబంలో వివాహ వేడుకలకు హాజరయ్యారు కొడాలి నాని. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు. కొడాలి నాని విదేశాలకు వెళ్తారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా సాగింది. ఇటువంటి తరుణంలో విమానాశ్రయాలు, ఓడరేవుల గుండా విదేశాలకు తరలిపోకుండా ఉండేందుకు కొడాలి నాని కి పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో తాజాగా కోల్ కత్తా నుంచి కొలంబోకు వెళ్తున్న కొడాలి నానిని పోలీసులు ఆపారు. లుక్ అవుట్ నోటీసుల కింద అడ్డుకున్నారు. ఏపీ పోలీస్ అధికారులకు అక్కడ విమానాశ్రయ అధికారులు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు పోలీసులు ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: Kodali Nani : మరో నెల రోజులు ఆసుపత్రిలోనే.. కొడాలి నాని ఆరోగ్యం పై బిగ్ అప్డేట్!
ఆసక్తిగా టిడిపి శ్రేణులు..
మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టుపై ఆశగా ఎదురుచూస్తున్నారు కూటమి పార్టీల శ్రేణులు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో రెచ్చిపోయేవారు కొడాలి నాని. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడేవారు. వ్యక్తిగత విమర్శలు చేసేవారు. ముఖ్యంగా చంద్రబాబుతో పాటు లోకేష్ పై నిత్యం బూతు పదాలతో తిట్ల దండకం అందుకునేవారు. ఈ క్రమంలో టిడిపి శ్రేణులు కొడాలి నాని పై విపరీతంగా ద్వేష భావం పెంచుకున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కొడాలి నాని కి వ్యతిరేకంగా టిడిపి శ్రేణులు రెచ్చిపోయాయి. అప్పటినుంచి ఏపీకి, సొంత నియోజకవర్గం గుడివాడకు దూరంగా ఉన్నారు కొడాలి నాని. అయితే ఇప్పుడు విదేశాలకు పారిపోవాలన్న ప్రయత్నంలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే లుక్ అవుట్ నోటీసులతో కోల్కత్తా విమానాశ్రయంలో ఆయనను అడ్డుకున్నారు. అయితే ఇప్పుడు ఏపీ పోలీసులు ఎలా వ్యవహరిస్తారు అన్నది చర్చకు దారితీస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.