Kodali Nani Attend Wedding: మాజీ మంత్రి కొడాలి నాని( Kodali Nani) విషయంలో ఒక ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. గత కొద్దిరోజులుగా అనారోగ్యానికి గురైన కొడాలి నాని హైదరాబాదులోని ఓ పెళ్లి వేడుకలో కనిపించారు. ఆయన అమెరికాకు పారిపోతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలు, ఓడరేవులకు ఈ నోటీసులు అందించింది. కొడాలి నానికి సైతం ఆన్లైన్లో ఈ సమాచారం ఇచ్చింది. అయితే వైద్యం కోసం ఆయన అమెరికా వెళ్తారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా హైదరాబాదులో జరిగిన ఓ పెళ్లి వేడుకలో కొడాలి నాని కనిపించడం విశేషం. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
* గుడివాడకు దూరంగా.. గుడివాడ( Gudivada) నుంచి 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు కొడాలి నాని. కానీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం ఓడిపోయింది. అయితే ఫలితాలు వచ్చిన తర్వాత రాష్ట్రానికి దూరంగా ఉంటూ వస్తున్నారు కొడాలి నాని. మొన్న ఆ మధ్యన తన స్నేహితుడు వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు జరిగిన తర్వాత పరామర్శించేందుకు వచ్చారు. ఆ సమయంలో మీడియాతో కూడా మాట్లాడారు. అటు తరువాత హైదరాబాదులో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. అక్కడే ప్రాథమిక చికిత్స చేసి ముంబైలోని ఏషియన్ హార్ట్ సెంటర్ కు తరలించారు. నానికి గుండె ఆపరేషన్ జరిగింది. గత కొద్దిరోజులుగా హైదరాబాదులో విశ్రాంతి తీసుకుంటూ వస్తున్నారు.
* అమెరికా వెళ్తారని ప్రచారం..
అయితే వైద్యుల సూచన మేరకు వైద్య పరీక్షల కోసం కొడాలి నాని అమెరికా( America) వెళ్తారని ప్రచారం సాగింది. దీంతో తెలుగుదేశం పార్టీ అప్రమత్తం అయ్యింది. చాలా రకాల కేసులు విచారణలో ఉన్నాయని.. నిందితుడు విదేశాలకు ఎలా వెళ్తారని ప్రశ్నించింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్పందించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి లుక్ అవుట్ నోటీసులు జారీ చేయించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిర్పోర్టులతో పాటు పోర్టులకు కలెక్ట్ చేశారు. త్వరలో కొడాలి నాని అరెస్టు ఉంటుందని కూడా ప్రచారం సాగుతోంది. ఇటువంటి తరుణంలోనే లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం విశేషం.
* పాత చిత్రాల?
ఇంకోవైపు కొడాలి నాని హైదరాబాదులో( Hyderabad) వివాహ వేడుకలో కనిపించారు. ఆపరేషన్ తర్వాత ఆయన బయటకు రావడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. బహుశా టిడిపి నేతలు ఇదే విషయాన్ని తెలుసుకుని.. కొడాలి నాని పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పట్లో కొడాలి నాని రాజకీయంగా యాక్టివ్ అయ్యే పరిస్థితి లేదని ప్రచారం నడిచింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆయన మామూలుగానే కనిపిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని.. పాత దృశ్యాలు జత కలిపి ప్రచారం చేస్తున్నారని వైసీపీ అభిమానులు చెబుతున్నారు. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.
హార్ట్ సర్జరీ తర్వాత తొలిసారి బయటికి వచ్చిన కొడాలి నాని
కొడాలి నానికి ఇటీవల ముంబైలో హార్ట్ సర్జరీ
హైదరాబాద్లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన కొడాలి నాని
దేశం విడిచి వెళ్తున్నారని నానిపై లుక్ఔట్ నోటీసులు జారీ చేసిన వేళ హఠాత్తుగా వివాహ వేడుకలో కనిపించిన కొడాలి https://t.co/LNwTSphIDY pic.twitter.com/hnkFc9e36i
— BIG TV Breaking News (@bigtvtelugu) May 24, 2025