Homeక్రైమ్‌Honeymoon Plan Gone Wrong: హనీ మూన్ కు నవ వరుడు ప్లాన్.. వెళ్తే మరో...

Honeymoon Plan Gone Wrong: హనీ మూన్ కు నవ వరుడు ప్లాన్.. వెళ్తే మరో మేఘాలయ అయ్యేది!

Honeymoon Plan Gone Wrong:  మేఘాలయ హనీమూన్ కేసు దేశవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అయితే ఇలాంటి వ్యవహారం మరొకటి వెలుగులోకి వచ్చింది. కాకపోతే ఈ సంఘటనలో నవ వరుడు ముందుగానే అప్రమత్తం కావడంతో అతడు బతికిపోయాడు.

ఉత్తర్ ప్రదేశ్ లోని బదౌన్ అనే ప్రాంతానికి చెందిన సునీల్ కు గత నెల 17న ఒక యువతీతో వివాహం జరిగింది. వివాహం జరిగిన తొమ్మిది రోజులు పాటు నవ వధువు 9 రోజుల పాటు తన భర్త ఇంట్లో ఉంది. ఆ తర్వాత పుట్టింటి వాళ్లు వచ్చి ఆమెను తీసుకెళ్లారు. పుట్టింటికి వెళ్లిన నవవధువు కేవలం ఒకరోజు వ్యవధిలోనే తన ప్రియుడితో ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఏ విషయం సునీల్ కు తెలియడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఆ తర్వాత తేరుకున్నాడు. వాస్తవానికి తన భార్యతో కలిసి హనీ మూన్ వెళ్లాలని సునీల్ నిర్ణయించుకున్నాడు.. దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు రూపొందించుకున్నాడు. కానీ ఇంతలోనే తన భార్య వారి పుట్టింటికి వెళ్లడం.. అక్కడి నుంచి తన ప్రియుడితో పారిపోవడంతో సునీల్ ఒక్కసారిగా హతాశుడయ్యాడు. భార్య చేసిన పనికి దిగ్బ్రాంతికి గురయ్యాడు.. వాస్తవానికి హనీమూన్ కు వెళ్తే తాను మరో రఘువంశీని అయ్యేవాడినని.. మేఘాలయ ఘటన మాదిరిగానే.. నా వార్త కూడా మీడియాలో వచ్చేదని సునీల్ పేర్కొన్నాడు.. అయితే తన భార్య ఆమె ప్రియుడి వద్ద ఉండడాన్ని అతడు అంగీకరించాడు..

వివాహం జరిగినప్పటికీ సునీల్ తో అతడి భార్య అంత చనువుగా ఉండేది కాదు.. నిత్యం ఫోన్ లోనే మాట్లాడుతూ ఉండేది..చాటింగ్ చేస్తూ ఉండేది. ఇది ఏంటని ప్రశ్నిస్తే.. తన స్నేహితులతో మాట్లాడుతున్నానని చెప్పేది. తొమ్మిది రోజులపాటు కూడా ఆమె ఇలానే వ్యవహరించింది. చివరికి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తనను తీసుకెళ్లాలని కోరింది..నవ వధువు కావడంతో ఆమె తరఫున కుటుంబ సభ్యులు కూడా అలానే చేశారు. తన పుట్టింటికి వెళ్ళిన తర్వాత సునీల్ కు ఫోన్ చేయడం మానేసింది. ఆ తర్వాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టింది. అనంతరం తన ప్రియుడితో ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. కుటుంబ సభ్యులకు ఈ వ్యవహారం తెలియకపోవడంతో పలుచోట్ల వెతికారు. చివరికి సునీల్ కి ఫోన్ చేశారు. ఆమె ఇక్కడికి రాలేదని చెప్పాడు. ఆ తర్వాత సునీల్ తనదైన శైలిలో ప్రయత్నించగా అసలు వ్యవహారం వెలుగు చూసింది.

Also Read:  Meghalaya Honeymoon Case: మేఘాలయ హనీమూన్ కేసులో.. మరో సంచలన వీడియో!

వివాహం జరిగిన తర్వాత తన భార్య తో కలిసి హనీమూన్ వెళ్లడానికి సునీల్ ప్రణాళికలు రూపొందించుకున్నాడు. ఇదే విషయం తన భార్యతో చెప్పాడు.. దానికి అప్పుడు ఆమె నిశ్శబ్దంగానే ఉంది. ఔను అని కాని, కాదని కాని సమాధానం చెప్పలేదు. ఆమె ఏదైనా సిగ్గు పడుతుందోనని భావించాడు. కానీ అది సిగ్గు కాదని, అసలు ఆమెకు పెళ్లి ఇష్టం లేదని..ఆమె వేరే వ్యక్తితో ప్రేమ యాణం కొనసాగిస్తున్న నేపథ్యంలో తనకు ఇచ్చి చేశారని సునీల్ గుర్తించాడు.. అయినప్పటికీ అతడు వారిని ఏమీ అనలేదు.. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులకు నవ వధువు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

నవ వధువు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే అతనితో వెళ్లడం ఆమెకు ఇష్టమని.. అతనితోనే ఉంటానని పోలీసులకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది.. అయితే వారిని త్వరలో తీసుకొస్తామని.. ఆమె మేజర్ అయినందువల్ల తాము చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశాలు లేదని పోలీసులు నవవధువు బంధువులతో చెప్పినట్టు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version