Kodali Nani Arrest : మాజీ మంత్రి కొడాలి నాని ( Kodali Nani) విషయంలో కూటమి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో అన్న చర్చ నడుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన అరెస్టు ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కానీ ఏడాది అవుతున్నా ఇంతవరకు ఆయన అరెస్టు జరగలేదు. వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ కొడాలి నానిదేనని తెగ ప్రచారం నడిచింది. అయితే ఇంతలో కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది. దీంతో ఆయన ఆరోగ్యం విషమంగానే ఉందని.. బయటకు ఇప్పట్లో రారని తెగ హడావిడి నడిచింది. కానీ ఆయన ఉన్నఫలంగా పెళ్లి రిసెప్షన్ లో కనిపించేసరికి.. ఏదో జరుగుతోందన్న అనుమానాలు బలపడ్డాయి.
* ప్రత్యేక ప్రకటన..
ఓ పెళ్లి వేడుకల్లో( marriage event) కనిపించిన కొడాలి నాని ఆరోగ్యంగా కనిపించారు. దీంతో ఆయన కేసులను మరింత ముందుకు తీసుకెళ్లి అరెస్టు చేసే సమయం ఆసన్నం అయిందని అంతా భావించారు. అయితే ఇంతలోనే కొడాలి క్యాంపు నుంచి ఒక వార్త బయటకు వచ్చింది. కొడాలి అంత యాక్టివ్ గా లేరని.. ఓ మిత్రుడి ఇంట్లో పెళ్ళికి తప్పనిసరిగా హాజరు కావాల్సి వచ్చిందని.. ఆయన ఎవర్ని కలవడం లేదని సమాచారం పంపారు. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కొడాలి నాని ఎక్కువమందిని కలవడం లేదు. ఆయన అమెరికా వెళ్లేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లుగా వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే అప్పుడే కొడాలి నాని పెళ్లి వేడుకల్లో ప్రత్యక్షమయ్యారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనను కలిసి ఎందుకు ప్రయత్నించారు. కానీ ఎవరిని కలిసే ఛాన్స్ ఇవ్వడం లేదు. కలిస్తే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్నందున ఎవరూ రావద్దని సూచిస్తున్నారు.
Also Read : పెళ్లి వేడుకల్లో కొడాలి నాని.. వీడియోలు వైరల్!
* కాస్త ఆరోగ్యంగానే..
పెళ్లి వేడుకల్లో కొడాలి నాని ఆరోగ్యంగానే ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఆయన ఆరోగ్యం విషమించిందని జరిగిన ప్రచారానికి భిన్నంగా పెళ్లి వేడుకల్లో కనిపించారు. దీంతో సంథింగ్ ఇస్ రాంగ్ అంటూ అనుమానాలు ప్రారంభమయ్యాయి. అదే సమయంలో కొడాలి నాని శిబిరం నుంచి ఈ సంకేతాలు వచ్చాయి. మరో రెండు నెలల తర్వాత కొడాలి నాని అందుబాటులోకి వస్తారని సంకేతాలు పంపారు. అయితే పోలీసులు కొడాలి నాని విషయంలో ప్రత్యేక వ్యూహంతో ఉన్నారు. ఏ నిమిషమైనా అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. వాస్తవానికి వల్లభనేని వంశీ మోహన్ తర్వాత అరెస్టు కొడాలి నాని దేనని టాక్ నడిచింది. గుండె నొప్పి, ఆపరేషన్ అని తప్పించుకోకపోతే ఇప్పటికే వంశీ తో పాటు అదే జైల్లో ఉండే వారన్న అభిప్రాయం అంతటా ఉంది.
* టిడిపి అభిమానుల కోరిక అదే..
ఎట్టి పరిస్థితుల్లో కొడాలి నాని విడిచి పెట్టవద్దని సగటు టిడిపి అభిమాని కోరుకుంటున్నారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేసేవారు కొడాలి నాని. అదే పనిగా వ్యక్తిగత విమర్శలు కూడా చేసేవారు. ఇటువంటి పరిస్థితుల్లో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి అరెస్ట్ కొడాలి నానిది అని అంతా భావించారు. కానీ ఏడాది పాటు జాప్యం జరిగింది. ఇప్పుడు పోలీసులు తన విషయంలో దూకుడుగా వ్యవహరిస్తారని తెలిసి కొడాలి నాని జాగ్రత్తపడ్డారని టిడిపి శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. చూడాలి మరి కొడాలి నాని విషయంలో కూటమి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో?