Kinjarapu Family: ఏపీ రాజకీయాల్లో కింజరాపు కుటుంబానికి( kinjarapu family ) ప్రత్యేక స్థానం. సుదీర్ఘ రాజకీయాలు నడిపింది ఆ కుటుంబం. దివంగత కింజరాపు ఎర్రం నాయుడు ఏపీ తో పాటు జాతీయ రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర చాటుకున్నారు. తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2 గా ఎదిగారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా అట్టిపెట్టుకొని ఉన్నారు. అందుకే ఆ కుటుంబానికి ఇప్పటికీ చంద్రబాబు ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు. ఎర్రన్నాయుడు అకాల మరణంతో రాజకీయాల్లోకి వచ్చారు ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. ఎర్రంనాయుడు సోదరుడు అచ్చెనాయుడు సైతం ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్లో కొనసాగుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయరని ప్రచారం జరుగుతోంది.. తెరపైకి ఆయన కుమారుడిని తెస్తారని తెలుస్తోంది.
Also Read: ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. వారు కూడా అర్హులే..
* టిడిపి ద్వారా ఎంట్రీ..
కింజరాపు ఎర్రం నాయుడు( Yaram Naidu) 1982లో తెలుగుదేశం పార్టీలో చేరారు. హరిచంద్రపురం నియోజకవర్గం నుంచి 1983లో పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. Kinjarapu Family1995 వరకు అదే నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు. 1989లో టిడిపి టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. 1994లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఎర్రం నాయుడు.. కొద్ది రోజులకే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి రికార్డు విజయం సొంతం చేసుకున్నారు. 1996, 1998, 1999, 2004 ఎన్నికల్లో వరుసగా ఎంపీగా గెలిచారు. 2009లో మాత్రం ఓడిపోయారు. అక్కడ కొద్ది రోజులకే రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయారు. తరువాత ఆయన వారసుడిగా రంగంలోకి దిగిన రామ్మోహన్ నాయుడు 2014, 2019, 2024 ఎన్నికల్లో ఎంపీగా గెలిచి సత్తా చాటారు.
* అన్న వారసుడిగా..
1994లో ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రం నాయుడు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. అప్పట్లో ఆయన వారసుడిగా తమ్ముడు అచ్చెనాయుడు రంగంలోకి దిగారు. హరిచంద్రపురం నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2004 ఎన్నికల్లో రెండోసారి గెలిచి సత్తా చాటారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనతో హరిచంద్రపురం కనుమరుగయింది. టెక్కలి నుంచి పోటీ చేసిన అచ్చన్నకు ఓటమి తప్పలేదు. 2014, 2019, 2024 ఎన్నికల్లో అచ్చెనాయుడు గెలిచారు. 2014లో మంత్రి పదవి చేపట్టారు. ఇప్పుడు మరోసారి మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పోటీ నుంచి తప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. తన బదులు కుమారుడు కృష్ణ మోహన్ నాయుడు కు అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కుమారుడు చదువు పూర్తి చేశాడు. టిడిపి ఐటి విభాగంలో పరోక్షంగా సేవలు అందిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి సీనియర్ నేతలు పక్కకు తప్పుకొని యువతకు అవకాశం ఇవ్వాలన్న కోణంలోనే.. అచ్చన్న ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Also Read: రెడ్డి వర్సెస్ కమ్మ వర్సెస్ బిసి.. ఏపీ బిజెపి కొత్త అధ్యక్షుడు ఆయనే!