Homeఆంధ్రప్రదేశ్‌CM Chandrababu: చంద్రబాబు మూడో ఆస్త్రం.. వైసీపీకి షాక్ ఇచ్చేలా!

CM Chandrababu: చంద్రబాబు మూడో ఆస్త్రం.. వైసీపీకి షాక్ ఇచ్చేలా!

CM Chandrababu: అమరావతి : చంద్రబాబు సర్కార్ దూకుడు మీద ఉంది. ఒకవైపు పాలన పరుగులు పెట్టిస్తూనే.. మరోవైపు గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తోంది.అందులో భాగంగా పోలవరం,అమరావతి రాజధాని నిర్మాణంలో వైసిపి ప్రభుత్వం అనుసరించిన నిర్లక్ష్య వైఖరి పై శ్వేత పత్రాలు విడుదల చేశారు. అవి ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ప్రజలను ఆలోచింపజేశాయి. ఈరోజు తాజాగా విద్యుత్ శాఖ పై శ్వేత పత్రం విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఈ మూడో శ్వేత పత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను బయట పెట్టేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం.

* 9సార్లు పెరిగిన చార్జీలు..
జగన్ ప్రభుత్వ హయాంలో తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెరిగాయి.2019 ఎన్నికల ప్రచారంలో జగన్ విద్యుత్ వైఫల్యాలను ఎక్కువగా ప్రస్తావించారు. తాము అధికారంలోకి వస్తే నాణ్యమైన విద్యుత్ ను తక్కువ ఛార్జీలకే అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలను పెంచారు. ఈ ఎన్నికల్లో దానినే ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు శ్వేత పత్రం రూపంలో మరిన్ని వైఫల్యాలను బయటపెట్టనున్నారు. ఏపీలో విద్యుత్ శాఖ పనితీరు ఎలా ఉంది? ఆర్థిక పరిస్థితి ఏంటి? అప్పులు ఎంత? వంటి వివరాలను వెల్లడించనున్నారు. 2019 కి ముందు విద్యుత్ వ్యవస్థ ఎలా ఉందో వివరించే ప్రయత్నం కూడా చేయనున్నారు. శ్వేత పత్రంలో పరిస్థితులను బట్టీ.. ధరలపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యుత్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఏం చేస్తారో? విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు సోలార్, విండ్ ఎనర్జీ ని ఎలా తీసుకొస్తారో ఈరోజు చంద్రబాబు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.
* జగన్ ను ఇరుకున పెట్టేలా..
గత ప్రభుత్వం విద్యుత్ శాఖను నిర్వీర్యం చేసిందన్న విమర్శలు ఉన్నాయి. అందుకే వైసీపీని శ్వేత పత్రం ద్వారా ఇరుకున పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే రెండు శ్వేత పత్రాలు విడుదల చేసి వైసిపి పాలన ఎంత దారుణంగా ఉందో వివరించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు వెల్లడించబోయే అంశాలు ఏంటి అనేది సర్వత్రా చర్చ జరుగుతోంది. అటు వైసీపీ నేతలు సైతం శ్వేత పత్రాలపై పెద్దగా స్పందించడం లేదు. జగన్ మాత్రమే అడపాదడపా మాట్లాడుతున్నారు. టిడిపి సర్కార్ నుంచి వస్తున్న విమర్శలను తిప్పి కొట్టడం లేదు. ఇది వైసీపీకి మైనస్ గా మారుతోందని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు మైనింగ్ శాఖకు సంబంధించి శ్వేత పత్రం విడుదల చేసేందుకు చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. నాలుగో శ్వేత పత్రంగా మైనింగ్ శాఖ ది ఉండబోతున్నట్లు సమాచారం. మొత్తానికైతే శ్వేత పత్రాలతో వైసీపీని ఇరుకున పెట్టాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు కొంతవరకు వర్క్ అవుట్ అవుతున్నాయి. ఆ స్థాయిలో వైసిపి తిప్పి కొట్ట లేకపోవడం ఆ పార్టీకి లోటే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version