Keshineni Daughter : వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ మరింత యాక్టివ్ కావాలని భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కీలక నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను మార్చాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. వచ్చేనెల 12 నాటికి కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. అయితే ఈ ఏడాది కాలంలో చాలా నియోజకవర్గాల్లో పరిస్థితి సైలెంట్ గా ఉంది. అటువంటి చోట్ల కొత్త నాయకత్వాన్ని తేవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ముఖ్యంగా పార్టీలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తున్నారు. అందులో భాగంగా విజయవాడ నగరం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. ముఖ్యంగా విజయవాడ తూర్పు నియోజకవర్గానికి కొత్త నేతను ఇన్చార్జిగా నియమిస్తారని సమాచారం. ఇప్పటికే దీనిపై ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే ఒక ప్రకటన కూడా చేస్తారని సమాచారం.
Also Read : ఆసుపత్రికి వల్లభనేని వంశీ.. హెల్త్ కండిషన్ పై బులిటెన్ విడుదల!
* అవినాష్ ను తప్పించి..
ప్రస్తుతం విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జిగా యువనేత దేవినేని అవినాష్( Avinash) ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న గద్దె రామ్మోహన్ చేతులు ఓడిపోయారు. అయితే ఇక్కడ సరైన అభ్యర్థిని దించితే కానీ గద్దె రామ్మోహన్ కు చెక్ చెప్పలేమని భావిస్తున్నారు జగన్. అందుకే పార్టీలో కొత్త నేతను తెచ్చి బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు. మాజీ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేతకు ఇక్కడ టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం నానితో పాటు ఆయన కుమార్తె క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల నాని వ్యవహార శైలి చూస్తుంటే ఆయన తిరిగి రాజకీయాల్లోకి రావడం ఖాయమని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన కుమార్తె శ్వేతతో వైసిపి నేతలు టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. 2021 మున్సిపల్ ఎన్నికల సమయంలో శ్వేత టిడిపి మేయర్ అభ్యర్థిగా బరిలో దిగారు. కానీ టిడిపిలో ఉన్న విభేదాలతో ఆమెకు మేయర్ పదవి రాకుండా పోయింది. కార్పొరేటర్ గా గెలిచిన ఆమె తండ్రి తో పాటే టిడిపికి గుడ్ బై చెప్పారు.
* అలా రాజకీయ సన్యాసం..
2014, 2019 ఎన్నికల్లో కేశినేని నాని విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే 2024 ఎన్నికలకు ముందు అనూహ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తీవ్ర మనస్తాపంతో రాజకీయాలనుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. అయితే ఇటీవల సోదరుడు, విజయవాడ ఎంపీ కేసినేని చిన్నితో ఆయనకు వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో కేశినేని నాని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి నుంచి ఇప్పటికే సమాచారం వచ్చిందని.. పార్టీలోకి వస్తే శ్వేతకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తానని జగన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే కేశినేని నాని మనస్సు బిజెపి వైపు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఏకంగా శ్వేత కోసం దేవినేని అవినాష్ ను తప్పించేందుకు జగన్ నిర్ణయించుకోవడం విశేషం. అయితే బిజెపి కంటే వైసీపీలోకి వెళ్తే ఇప్పుడు ప్రాధాన్యం దక్కుతుందని కేసినేని ఫ్యామిలీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే కేశినేని ఫ్యామిలీ ఇవ్వడం ద్వారా.. విజయవాడలో పట్టు పెంచుకోవాలని జగన్ భావిస్తున్నారు. మరి అది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.