spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Kendriya Vidyalaya Admissions 2026: అక్కడ సీటు వస్తే అదృష్టమే.. అడ్మిషన్లు ప్రారంభం!

Kendriya Vidyalaya Admissions 2026: అక్కడ సీటు వస్తే అదృష్టమే.. అడ్మిషన్లు ప్రారంభం!

Kendriya Vidyalaya Admissions 2026: ఆంధ్రప్రదేశ్లో( Andhra Pradesh) విద్యార్థులకు గుడ్ న్యూస్. కేంద్రీయ విద్యాలయాల్లో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం అయింది. నేటి నుంచి అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పించింది ఏపీ ప్రభుత్వం. ఏప్రిల్ 2 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. 2026 మార్చి 31 నాటికి ఆరేళ్లు వయసు పూర్తయిన వారు కేంద్రీయ విద్యాలయాల్లో చేరేందుకు అర్హులు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా నర్సరీ, యూకేజీ తో పాటు ఒకటో తరగతిలో చేరితే.. అక్కడే ఇంటర్ వరకు చదువుకునే అవకాశం ఉంటుంది. ఉత్తమ విద్య బోధనతో పాటు సెంట్రల్ సిలబస్ తో ఇక్కడ బోధన కొనసాగనుంది. బాల వాటిక 1, బాల వాటిక 2 అనే రెండు విభాగాల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఏప్రిల్ 2 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆన్లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

35 విద్యాలయాల్లో..
రాష్ట్రవ్యాప్తంగా 35 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. కొద్దిరోజుల కిందటే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఒక నాలుగు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. దాదాపు అన్ని కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లను ప్రారంభించింది. ఇంటర్లో ప్రవేశాలకు సంబంధించి.. CBSE పదో తరగతి ఫలితాలు వచ్చిన తర్వాత దరఖాస్తులు స్వీకరిస్తారు. 2026 మార్చి 31 నాటికి ఆరేళ్లు నిండిన వారు ఒకటో తరగతిలో అడ్మిషన్లకు అర్హులు. విద్యార్థి పుట్టిన తేదీ ధ్రువ పత్రం, ఆధార్ కార్డ్, ఫోటో, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ లో https://kvsangathan.nic. In లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Also Read: చంద్రబాబు మెత్తబడినా.. ఆ మాజీ మంత్రికి టిడిపి డోర్స్ క్లోజ్!

అడ్మిషన్లకు సంబంధించి ప్రత్యేక కేటగిరీలు ఉంటాయి. Kvs ఉద్యోగుల పిల్లలు, రక్షణ/ పారా మిలటరీ పిల్లలు, స్పోర్ట్స్, అవార్డు విన్నర్స్ పిల్లలు, కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన అనాధ పిల్లలకి ఉంటాయి. అదే సమయంలో తప్పుడు సమాచారంతో అడ్మిషన్లు పొందితే రద్దు చేస్తారు.

అమరావతి ప్రాంతంలో సత్తెనపల్లి, నల్లపాడు, తెనాలి, బాపట్ల సమీపంలోని సూర్యలంక, ఇర్లపాడులో కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా 8 విద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సంగతి తెలిసిందే. వాటిలో సైతం అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందితే మళ్ళీ ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదువుకునే వెసులుబాటు ఉంటుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Venkatesh Kalyan Ram Movie

Venkatesh Kalyan Ram Movie: అనిల్ రావిపూడి కి తెలియకుండా వెంకటేష్ – కళ్యాణ్ రామ్ ఎంజాయ్ చేస్తున్నారుగా…

Venkatesh Kalyan Ram Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాలను చేస్తూ...
Bigg Boss Telugu

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ ఆఫర్ పై జబర్దస్త్ బ్యూటీ హాట్ కామెంట్స్.. ఈ...

Bigg Boss 10 Telugu: సెప్టెంబర్ 6 న ఇండియా వైడ్ గా అన్ని భాషలకు సంబంధించిన బిగ్ బాస్ సీజన్స్ గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నాయి. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్...
Nagarjuna

Nagarjuna: నాగార్జున కొడుకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడా…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చిన వాళ్ళలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి ప్రేక్షకులను మైమరపింపజేసిన ఆయన ఇతర ఇండస్ట్రీలో నుంచి ఎదురయ్యే...
Oktelugu Epaper