Kadapa Student : జాక్ పాట్ అంటే ఆమెది.. తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం.. వార్షిక వేతనం రూ. 1.70 కోట్లు

 ఉద్యోగం అంటేనే గగనం అవుతున్న రోజులు ఇవి. ఒక ఉద్యోగానికి విపరీతమైన పోటీ. అటువంటిది తొలి ప్రయత్నం లోనే యువతికి ఉద్యోగం దక్కింది.ఏకంగా రూ. 1.70 కోట్ల ప్యాకేజీతో వార్షిక వేతనం దక్కించుకుంది.

Written By: Dharma, Updated On : September 1, 2024 7:40 pm

yerranagula amruthavalli

Follow us on

Kadapa Student :  కలలు అందరూ కంటారు. కానీ కొంతమంది మాత్రమే సహకారం చేసుకుంటారు.ఉన్నత ఉద్యోగం సాధించి మంచి జీతం పొందాలని అందరికీ ఉంటుంది. కానీ సాధ్యపడేది కొందరికే.కానీ ఓ యువతిమాత్రం అనుకున్నది సాధించింది. వార్షిక వేతనం 20 నుంచి 30 లక్షలు ఉంటే అమ్మో అంత ప్యాకేజీయా? అన్న రోజులివి. కానీ ఆ యువతీ ఏకంగా కోటి 70 లక్షల రూపాయల వేతనంతో జాక్ పాట్ కొట్టేసింది. అయితే తన తొలి ప్రయత్నం లోనే ఈ భారీ ప్యాకేజీ తో కొలువు సొంతం చేసుకోవడం విశేషం. కడప నగరానికి చెందిన ఎర్ర నాగుల అమృతవల్లికి  అమెరికాకు చెందిన ఓ కంపెనీ ఏడాదికి కోటి 70 లక్షల వేతనాన్ని ఆఫర్ చేసింది. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమృతవల్లి విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. అనంతరం ఐఐటి జేఈఈ పరీక్షలో ప్రతిభ చూపింది. కానీ త్రుటిలో ఐఐటీలో సీటు చేజారింది. ఎన్ఐటి దుర్గాపూర్ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో చేరింది. అక్కడ బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఉన్నత చదువుల కోసం అమృతవల్లి అమెరికా వెళ్ళింది. ఆఫ్ ఫ్లోరిడాలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ లో ఎంఎస్ పూర్తి చేసింది. డిగ్రీ తీసుకున్న నెల రోజుల్లోనే ఈ కొలువు సాధించింది. ప్రపంచ ప్రఖ్యాతి సంస్థ అమెజాన్ కు ఎంపికైంది. వాషింగ్టన్ లోని సియాటెల్ లో అమెజాన్ కేంద్ర కార్యాలయంలో సాఫ్ట్వేర్ డెవలప్ ఇంజనీర్ గా చేరనుంది.
 * సాధారణ కుటుంబం 
 అమృతవల్లికి సాధారణ మధ్యతరగతి కుటుంబం. కానీ చిన్నప్పటి నుంచి ఆమె చదువులో ముందంజలో ఉండేది. అందుకు తగ్గట్టుగానే తల్లిదండ్రులు ప్రోత్సాహం అందిస్తూ వచ్చారు. అయితే తొలి ప్రయత్నం లోనే ఆమె భారీ వార్షిక వేతనానికి ఎంపిక కావడంపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి అమృతవల్లి ఇండియాలోనే ఎక్కడైనా స్థిరపడాలని భావించారు. కానీ ప్రపంచ ప్రఖ్యాత సంస్థ అమెజాన్ లో ఛాన్స్ రావడంతో అక్కడ చేరేందుకు మొగ్గు చూపుతున్నారు.
 * ఉన్నత కొలువులు 
 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది యువత ఇప్పుడు ఉన్నత కొలువులు పొందుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి సంస్థల్లో ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. భారీ వార్షిక వేతనం  పొందుతున్నారు. కొద్ది రోజుల కిందట ప్రకాశం జిల్లా కు చెందిన సాధించింది. రోజుల వ్యవధిలోనే మొదటిసారి ఎంపికైన ఉద్యోగానికి.. దాదాపు నాలుగు రెట్లు అధికమైన ప్యాకేజీతో ఐదో ఉద్యోగం సొంతం చేసుకుంది శ్రావణి అనే యువతి. తల్లిదండ్రులకు గుర్తింపు తీసుకురావాలన్న ఆరాటంతోనే ఒకేసారి ఐదు కొలువులను పొందింది. ఒకేసారి మూడు ఉద్యోగాలు సాధించిన వారి తల్లిదండ్రులకు కళాశాల యాజమాన్యం సన్మానిస్తూ వచ్చింది. ఆ సన్మానం తన తల్లిదండ్రులకు దక్కాలని భావించి ఒకేసారి ఏకంగా ఐదు కొలువులను సాధించింది శ్రావణి.
 * క్యాంపస్ నియామకాలు తగ్గినా 
 ప్రస్తుతం ఐటి రంగంలో ఉద్యోగాలు తగ్గుముఖం పట్టాయి. క్యాంపస్ ఇంటర్వ్యూలు కూడా తగ్గాయి. కానీ వరుసగా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువత విదేశీ కంపెనీలకు ఎక్కువగా ఎంపిక అవుతుండడం విశేషం. అది కూడా భారీ ప్యాకేజీకి ఎంపికవుతుండడంతో  సర్వత్ర ఆసక్తి నెలకొంది. మిగతా విద్యార్థుల సైతం స్ఫూర్తిగా తీసుకొని ప్రయత్నాలు చేస్తున్నారు.