https://oktelugu.com/

Natural Star Nani  : అక్షరాలా 20 మిలియన్ల డాలర్లు..నేచురల్ స్టార్ నాని దరిదాపుల్లో మరో హీరో లేడు!

స్టార్ హీరోల డామినేషన్ విపరీతంగా ఉన్నటువంటి ఈ ఇండస్ట్రీలో, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాని వంద కోట్ల గ్రాస్ వసూళ్లను అవలీలగా ఇచ్చేస్తున్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : September 1, 2024 7:25 pm
    Natural Star Nani 

    Natural Star Nani 

    Follow us on

    Natural Star Nani  : ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత హీరోగా మారి నేడు స్టార్ హీరోలతో సమానంగా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ పెట్టే స్థాయికి ఎదిగిన నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా సినిమాకి ఆయన తనని తాను మార్చుకుంటున్న విధానం, తన మార్కెట్ ని పెంచుకుంటున్న తీరు కొత్తగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టే ప్రతీ కుర్ర హీరోకి ఒక కేసు స్టడీ లాంటిది. మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ ఎంత ఆదర్శప్రాయంగా ఉంటుందో, నాని సినీ కెరీర్ కూడా నేటి తరం యంగ్ హీరోలకు అంతే ఆదర్శంగా ఉంటుంది. పాన్ ఇండియా లెవెల్ లో మన తెలుగు సినిమాలు తెరకెక్కుతున్నాయి. స్టార్ హీరోల డామినేషన్ విపరీతంగా ఉన్నటువంటి ఈ ఇండస్ట్రీలో, ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాని వంద కోట్ల గ్రాస్ వసూళ్లను అవలీలగా ఇచ్చేస్తున్నాడు.

    భారీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఎంతోమంది వారసులు ఇప్పటి వరకు 100 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరకపోవడం గమనించాల్సిన విషయం. ఇదంతా పక్కన పెడితే ఓవర్సీస్ లో నాని మార్కెట్ ఇప్పటి స్టార్ హీరోల సినిమాలకు ఏమాత్రం తక్కువ కాదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలలో 10 చిత్రాలు 1 మిలియన్ మార్కుని దాటాయి. రీసెంట్ గా విడుదలైన ‘సరిపోదా శనివారం’ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే 1 మిలియన్ డాలర్ వసూళ్లను రాబట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం. ఈ చిత్రం తో ఇప్పటి వరకు ఆయన ఓవర్సీస్ సినిమాల వసూళ్లను మొత్తం లెక్కగడిత్తే 20 మిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని ట్రేడ్ పండితుల అంచనా. ఇది కేవలం ఓవర్సీస్ లోని నార్త్ అమెరికా గ్రాస్ మాత్రమే. ఆస్ట్రేలియా, లండన్, గల్ఫ్ దేశాలు కలిపి 30 మిలియన్ డాలర్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఆయన హీరో గా నటించిన ‘దసరా’ చిత్రం ఒక్క నార్త్ అమెరికా నుండే 2 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇప్పుడు ‘సరిపోదా శనివారం’ చిత్రం కూడా రెండు మిలియన్ డాలర్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

    అంతే కాకుండా ఫుల్ రన్ లో ఈ చిత్రం కూడా వరల్డ్ వైడ్ గా 100 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబడుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. అనేక ప్రాంతాలలో నేడు ఈ చిత్రం మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది. విడుదలకు ముందు ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమా, కేవలం నాలుగు రోజుల్లోనే 30 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని ట్రేడ్ పండితులు అంటున్నారు, చూడాలి మరి.