https://oktelugu.com/

Ustad Bhagat Singh : పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్ లో పాల్గొనేది అప్పుడేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొంతమందికి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ లో బిజీగా ఉన్నప్పటికీ సినిమాల పరంగా మాత్రం ఆయనకున్న క్రేజ్ మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికి కూడా ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకులు ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు...

Written By:
  • Vicky
  • , Updated On : September 1, 2024 / 08:21 PM IST

    Ustad Bhagat Singh

    Follow us on

    Ustad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలను చేస్తు తనకంటూ ఒక వైవిధ్యమైన గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. ఈవివి సత్యనారాయణ డైరెక్షన్ లో వచ్చిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు సక్సెస్ ఫుల్ గా తన కెరియర్ ని ముందుకు సాగిస్తూ సినిమాలు చేయడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇక అలాంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాని చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలో దాదాపు ఆరు నెలల నుంచి సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఆయన బ్రేక్ ఇచ్చి ఎలక్షన్స్ లో చాలా చురుగ్గా పాల్గొన్న విషయం మనకు తెలిసిందే…ఇక ఇప్పుడు ఆయన సపోర్ట్ చేసిన ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలను చేపట్టిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేసే పనుల్లో చాలా బిజీగా కొనసాగుతున్నాడు.

    ఇక ఇదిలా ఉంటే ఎట్టకేలకు ఆయన సినిమా షూటింగ్ ల్లో పాల్గొనడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న మూడు సినిమాల ప్రొడ్యూసర్స్ కళ్యాణ్ గారిని కలిసి అతనితో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక దీంతో తొందర్లోనే ఈ మూడు సినిమాల కోసం తన డేట్స్ ని పవన్ కళ్యాణ్ కేటాయించబోతున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి.

    అయితే హరీష్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులందరిని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకుముందే గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. కాబట్టి ఈ సినిమాతో మరోసారి ఆ సక్సెస్ ని రిపీట్ చేయాలనే ఉద్దేశ్యం లో హరీష్ శంకర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక అందుకే హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమానే పవన్ కళ్యాణ్ ముందుగా ఫినిష్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

    ఇక రీసెంట్ గా హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ సినిమాతో ఒక భారీ ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. మరి ఇప్పుడు కనక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో సక్సెస్ ని సాధించకపోతే మాత్రం హరీష్ శంకర్ క్రేజ్ పడిపోతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…