KA Paul: ఏం కామెడీ రా బాబూ: చంద్రబాబుతో పోల్చుకున్న కేఏ పాల్

మొన్న ఆ మధ్య కేఏ పాల్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. పోలీసులు దానిని భగ్నం చేశారు. పాల్ ను పోలీస్ స్టేషన్కు తరలించారు.

Written By: Dharma, Updated On : September 13, 2023 1:32 pm

KA Paul

Follow us on

KA Paul: తెలుగు రాష్ట్రాల్లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏది మాట్లాడినా ఒక సంచలనమే. తాజాగా ఆయన చంద్రబాబు అరెస్టుపై మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా ఆమరణ నిరాహార దీక్ష చేపడితే ఎవరూ పట్టించుకోలేదని.. చంద్రబాబు అవినీతి చేస్తే మాత్రం తెగ హడావిడి చేస్తున్నారని పాల్ విమర్శించారు. చంద్రబాబు ముమ్మాటికి అవినీతికి పాల్పడ్డారని.. ఆయన అరెస్ట్ కరెక్ట్ చర్యగా అభివర్ణించారు. జగన్ సర్కార్ తో పాటు పవన్ కళ్యాణ్ పై సైతం పాల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మొన్న ఆ మధ్య కేఏ పాల్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. పోలీసులు దానిని భగ్నం చేశారు. పాల్ ను పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఇలా వెళ్లిన పాల్.. అక్కడ నుంచి తప్పించుకొని దీక్షా శిబిరానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనపై దూకుడు కనబరిచారు. ఈ క్రమంలో సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేయాలని జగన్ సర్కార్ కు పాల్ అల్టిమేటం జారీ చేశారు. కానీ ప్రభుత్వం లైట్ తీసుకుంది. అటు పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.

నాడు తాను విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణకు ఆమరణ నిరాహార దీక్షకు దిగితే ఎవరూ పట్టించుకోలేదని తాజాగా పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పై 12 సెక్షన్లతో కేసులు నమోదు చేశారని.. ఆయన అరెస్టు ముమ్మాటికీ కరెక్టేనని.. ఆయన 100% తప్పు చేశారని పాల్ చెప్పుకొచ్చారు. 8 లక్షల కోట్ల విలువైన విశాఖ స్టీల్ ప్లాంట్ ను 4000 కోట్లకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని.. దానిపై నేను పోరాడుతుంటే ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేను చంద్రబాబు కంటే ఎందులో తక్కువ అని ప్రశ్నించారు. పైగా చంద్రబాబును గాంధీజీ, అంబేద్కర్ తో పోల్చడం ఏమిటని నిలదీశారు.

పవన్ కళ్యాణ్ పై సైతం పాల్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. విశాఖలో నేను దీక్ష చేపడితే ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఎందుకు ప్రశ్నించావని.. అందుకు ఎంత ప్యాకేజీ తీసుకున్నావని నిలదీశారు. పవన్ వ్యక్తిత్వాన్ని తెలుసుకుని జనసైనికులంతా ప్రజాశాంతి పార్టీలో చేరాలని పాల్ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు అరెస్టుపై స్పందిస్తూనే.. చంద్రబాబు కంటే నేను ఎందులో తక్కువని ప్రశ్నించడం ద్వారా తెలుగు ప్రజలకు పాల్ వినోదం పంచారు. అసలే చంద్రబాబుకు బెయిల్ రాలేదన్న బాధతో ఉన్న టిడిపి శ్రేణులు పాల్ వ్యాఖ్యలపై మండిపడుతున్నాయి.