Homeఆంధ్రప్రదేశ్‌KA Paul Super Six: నాతో పెట్టుకున్నోళ్లు ఎవరూ మిగల్లేదు.. పైకిపోయారు.. కేఏ పాల్ వార్నింగ్

KA Paul Super Six: నాతో పెట్టుకున్నోళ్లు ఎవరూ మిగల్లేదు.. పైకిపోయారు.. కేఏ పాల్ వార్నింగ్

KA Paul Super Six: పేరడీ డైలాగులతో కడుపుబ్బ నవ్విస్తారు కమెడియన్ బ్రహ్మానందం. బాలకృష్ణ పలికే ఫైర్ విల్ బి ఫైర్ అంటూ పలికే డైలాగ్ బ్రహ్మానందం నోట వినిపిస్తే ఆ ఆనందమే వేరు. అలాగే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్( KA Paul ) సైతం. సుత్తిమెత్త హెచ్చరికలను సైతం తీవ్రస్థాయిలో పలుకుతారు. ఎక్కడా మాట బెనకదు. అలాగని మాటలో తప్పులు దొర్లవు. ఎంతటి ఆవేశంలోనైనా తప్పులు దొర్లకుండా మాట్లాడడంలో కేఏ పాల్ దిట్ట అని చెప్పవచ్చు. తాజాగా సూపర్ సిక్స్ పథకాలపై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కూటమి నేతలకు కౌంటర్
కూటమి మేనిఫెస్టో గా సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వస్తే తప్పకుండా సూపర్ సిక్స్( super six ) పథకాలను అమలు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడిప్పుడే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. తల్లికి వందనం పథకం అమలు చేశారు. అన్నదాత సుఖీభవ అమలు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి ఆగస్టు 15 నుంచి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో సూపర్ సిక్స్ పథకాలన్నీ దాదాపు అమలు చేశామని.. ఇకనుంచి సూపర్ సిక్స్ పథకాలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తే నాలుక కోస్తాం అంటూ కూటమి నేతలు హెచ్చరిస్తున్నారు. దీనిపై తాజాగా స్పందించారు కే ఏ పాల్. కూటమి నేతలకు గట్టిగానే ఇచ్చి పడేశారు. కేఏ పాల్ ఆగ్రహంగా మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Also Read: ఆ ఇద్దరు మంత్రుల శాఖల మార్పు!

నెటిజన్ల కామెంట్స్..
గతంలో తనతో పెట్టుకున్న వారు ఎక్కడికో వెళ్లిపోయారంటూ చెప్పుకొచ్చారు కేఏ పాల్. చాలామంది అమెరికన్స్ తో( Americans ) పాటు ఇండియన్స్ తనతో పెట్టుకుని వెళ్లిపోయారని.. ఏడుగురు మిగలకుండా పోయారంటూ కామెంట్స్ చేస్తారు. సూపర్ సిక్స్ పథకాలు గురించి అడిగితే నాలుక కోస్తావా.. నేను తలచుకుంటే నువ్వు కూడా పోతావు అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఏఏ పాల్ చేసిన కామెంట్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version