WhatsApp features: ఇప్పుడున్న కాలంలో వాట్సాప్ లేని మొబైల్ లేదనే అనుకోవాలి. ప్రతి కమ్యూనికేషన్స్ కు.. ఫైనాన్స్ మ్యాటర్స్ కు.. ఫైల్స్ సెండ్ చేసుకోవడానికి వాట్సప్ ప్రధానంగా ఉంటుంది. అయితే వాట్సాప్ లో కొన్ని ముఖ్యమైన ఫైల్స్ కూడా పంపించుకునే అవకాశం ఉంది. ఈ ఫైల్స్ ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడాలని కొందరు అనుకుంటారు. కానీ కొంతమంది సరదాగా కూడా మొబైల్ తీసుకుని వాట్సాప్ ను చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇలా మనం మనకు సంబంధించిన ఫైల్స్ ఇతరులను చూడకుండా.. చేయడానికి వాట్సాప్ లో అవకాశం ఉంది. అంతేకాకుండా డాక్యుమెంట్స్ అన్ని ఒకేసారి పిడిఎఫ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. మరి ఇలాంటి విషయాలు ఎలాగో తెలుసుకోవాలని ఉందా.?
Also Read: ఢిల్లీలో పెనుభూకంపం.. ఏంటీ ఉపద్రవం.. ఎందుకిలా?
ఆఫీసుకు సంబంధించిన కొన్ని పేపర్స్ అన్ని పిడిఎఫ్ చేయాల్సి ఉంటుంది. కానీ వాటిని స్కాన్ చేసి సిస్టంలోకి పంపించుకొని ఆ తర్వాత పిడిఎఫ్ క్రియేట్ తో చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడానికి చాలా సమయం తీసుకుంటుంది. అంతేకాకుండా దీనికి ప్రత్యేకంగా కంప్యూటర్ కావాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం మొబైల్ లో వాట్సాప్ ఉంటే చాలు.. ఈ పని ఈజీగా అయిపోతుంది. ఇందుకోసం వాట్సాప్ ను ఓపెన్ చేయాలి. చాటింగ్ చేసే బాక్స్ పక్కన ఇమేజ్ + అనే సింబల్ కనిపిస్తోంది. దీనిపై ప్రెస్ చేయగా కెమెరా ఓపెన్ అవుతుంది. ఈ కెమెరా తో డాక్యుమెంట్స్ ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఒకేసారి పది డాక్యుమెంట్స్ స్కాన్ చేసిన తర్వాత ఆటోమేటిగ్గా పిడిఎఫ్ లోకి మారుతుంది. ఈ పిడిఎఫ్ ఫైల్ ను ఇతరులకు పంపించుకోవచ్చు.
అలాగే వాట్సాప్ లో కొందరు పర్సనల్ ఆడియోలను పంపిస్తారు. ఈ ఆడియో ఇతరుల వద్ద వినడానికి ఇబ్బందిగా ఉంటుంది. అయితే ముందుగానే వాట్సాప్ లో సెట్టింగ్స్ లోకి వెళ్లి చాట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళాలి. ఇక్కడ వాయిస్ ట్రాన్స్మిషన్ అనే దానిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే వచ్చే ప్రతి ఆడియో టెక్స్ట్ రూపంలోకి మారుతుంది. దీంతో ఈ ఆడియో ఏంటో వెంటనే తెలుసుకోవచ్చు.
ఇక కొందరు పర్సనల్ వ్యక్తులతో చాటింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా చాటింగ్ చేసే వారి వ్యక్తి గురించి ఇతరులు తెలుసుకోకుండా ఉండడానికి.. వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. ఇక్కడ లాక్ చాట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీనిని ప్రెస్ చేయడంతో ఆ చాట్ కనిపించకుండా పోతుంది. అయితే మళ్లీ కావాల్సినప్పుడు దానిని హైడ్ లాక్ అని ప్రెస్ చేయాలి. అయితే ఈ సమయంలో ఒక సీక్రెట్ కోడ్ను ఏర్పాటు చేసుకోవాలి. ఈ కోడ్ ఎంటర్ చేస్తేనే ఆ చాట్ ఓపెన్ అవుతుంది. దీంతో ఇతరులు ఎవరు ఈ చాట్ ను చూడలేరు.
Also Read: మీ ఫ్రెండ్ ఎప్పుడూ సైలెంట్ గా ఉంటున్నారా? అతనికి క్యారెక్టర్ ఇదే..
ఇలా వాట్సాప్ లోకి అనేక ఉపయోగకరమైన ఆప్షన్లో అందుబాటులోకి వస్తున్నాయి. అయితే వాట్సాప్ వాడే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా అన్నం నంబర్స్ నుంచి ఎలాంటి బిజినెస్ ఆఫర్స్, మనీ ట్రాన్సాక్షన్ కు సంబంధించిన మెసేజ్ వస్తే వెంటనే వాటిని అవాయిడ్ చేయడం మంచిది.