KA Paul : ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్( KA pal ) మరోసారి తనదైన శైలిలో స్పందిస్తున్నారు. సమకాలీన రాజకీయ అంశాలపై మాట్లాడుతున్నారు. పాక్ తో యుద్ధం పై తాజాగా మీడియాకు ప్రెస్ మీట్ ఇచ్చారు. ఆ దేశంతో చర్చల జరపడానికి పాకిస్తాన్ వెళ్ళనున్నట్లు తెలిపారు. యుద్ధం నిలిపి వేయిస్తానని కూడా ప్రకటించారు. తాను ప్రపంచ శాంతి దూత అని.. తాను చెబితే అమెరికా అధ్యక్షులు విన్నారు. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్తో యుద్దాలు నిలిపి వేయించానని చెప్పుకొచ్చారు. అయితే పనిలో పనిగా రాష్ట్ర రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. సోషల్ మీడియాలో పాల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read : వైసిపి ప్లీనరీ.. ఈసారి అంతకుమించి..
* జగన్ క్రిస్టియన్ కాదట..
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు కేఏ పాల్. జగన్మోహన్ రెడ్డి అసలు క్రిస్టియన్ కాదని తేల్చి చెప్పారు. జగన్ చిన్న జీయర్ స్వామి భక్తుడని బాంబు పేల్చారు. తన ఆశీర్వాదం తీసుకోలేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడన్నారు. ఇప్పుడున్న రాజకీయ నేతలు అంతా మోడీ తొత్తులు అని అందరిపై విమర్శలు చేశారు. పాకిస్తాన్ తో చర్చలు జరిపేందుకు తాను ఆ దేశానికి వెళ్తానని కూడా అన్నారు కే ఏ పాల్.
* ప్రవీణ్ పగడాల మృతి పై స్పందన..
మరోవైపు పాస్టర్ ప్రవీణ్ పగడాల( Praveen pagadala మృతిపై కూడా మాట్లాడారు. ఆయనది హత్య అని అనుమానం వ్యక్తం చేశారు. తాను హైకోర్టులో పిటిషన్ వేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఐదు లక్షల రూపాయల డిపాజిట్ చేయమని జడ్జి చెప్పిన విషయాన్ని వెల్లడించారు. ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటానని కూడా పాల్ అన్నారు. చివరికి ప్రెస్ మీట్ ముగించే ముందు కూడా ఒక పంచ్ డైలాగ్ కొట్టారు. కేఏ పాల్ కి అధికారం వస్తేనే పాలన మారుతుంది అని తేల్చి చెప్పారు. మొత్తానికైతే కేఏ పాల్ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. మీడియాకు సరైన వనరు అందిస్తున్నారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ పై కే.ఏ.పాల్ సంచలన వ్యాఖ్యలు..
జగన్ అసలు క్రిస్టియన్ కాదు.. చిన్న జీయర్ భక్తుడు
నా ఆశీర్వాదం తీసుకోలేదు కాబట్టే జగన్ చిత్తుగా ఓడిపోయారు
– కే.ఏ.పాల్ pic.twitter.com/cUmhrA6INC
— BIG TV Breaking News (@bigtvtelugu) May 8, 2025