https://oktelugu.com/

Ongole : అసలోడు జూ.ఎన్టీఆర్.. మరి కొసరోడు ఎవడు?

ఒంగోలులో అసలు ఎవరు పెట్టారో తెలియకుండా.. కొన్ని ప్లెక్సీలను పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ నెక్ట్స్ సీఎం అయినా.. అసలు వాడు వచ్చే వరుకు కొసరు వాడికి పండగేనని క్యాప్షన్ అందులో పెట్టారు.

Written By:
  • Dharma
  • , Updated On : July 18, 2023 / 04:14 PM IST
    Follow us on

    Ongole : లోకేష్ యువగళం పాదయాత్రకు వైసీపీ పనిగట్టుకొని ప్రచారం కల్పిస్తోంది. ఆయనేదో సాదాసీదాగా నడుచుకుంటూ ముందుకుపోతుంటే.. వెకిలి చేష్టలతో హైప్ చేస్తోంది. అసలు యాత్ర ప్రారంభం నుంచి అంతే. ఐ ప్యాక్ టీమ్ ఓ వైపు.. సోషల్ మీడియా టీమ్ మరోవైపు వరుసపెట్టి లోకేష్ ను పలుచన చేసే ప్రయత్నం చేశాయి.ఈ విషయంలో సక్సెస్ అయినట్టే కనిపించి చతికిలపడ్డాయి. యాత్రను అనుసరించే టీడీపీ శ్రేణుల కంటే.. ప్లాఫ్ షో అని చూపించాలనుకున్న ఐప్యాక్, వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులే ఎక్కువగా అనుసరించారు. పాదయాత్రకు సరికొత్త శోభ తెచ్చారు.

    యాత్ర తొలినాళ్లలో లోకేష్ పాదయాత్ర కోసం వైసీపీ నియమించుకున్న సోషల్ మీడియా టీమ్ 1000 మంది. లోకేష్ ను అడుగడుగునా వాచ్ చేసి..జనం లేనట్టు..లోకేష్ తత్తరపాటుకు గురైనట్టు.. ఉన్నది లేనట్టు చేసి కనికట్టు మంత్రంతో ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలన్నదే వారి అభిమతం. కానీ అనుకున్నది ఒక్కటి.. అయ్యింది ఒక్కటి. ఇలా సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం వచ్చిందే తడవు..ఫ్యాక్ట్ చెక్ పేరిట.. ఇది అసలు కథా అని టీడీపీ సోషల్ మీడియా, ఎల్లో మీడియా స్పష్టంగా చూపించేవి. దీంతో ఐ ప్యాక్ తో పాటు వైసీపీ సోషల్ మీడియాది వృథా ప్రయాసగా మిగిలిపోయింది.

    ప్రస్తుతం యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. టీడీపీ శ్రేణుల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. సహజంగానే ఇది వైసీపీ శ్రేణులకు కంటిమీద కునుకు ఉంచడం లేదు. దీంతో అరిగిపోయిన పాత వ్యూహాన్ని కొత్తగా ఇంప్లిమెంట్ చేద్దామని ప్రయత్నించి.. నవ్వుల పాలవుతున్నారు. ఒంగోలులో అసలు ఎవరు పెట్టారో తెలియకుండా.. కొన్ని ప్లెక్సీలను పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ నెక్ట్స్ సీఎం అయినా.. అసలు వాడు వచ్చే వరుకు కొసరు వాడికి పండగేనని క్యాప్షన్ అందులో పెట్టారు. అది టీడీపీ వాళ్లే పెట్టారు అనిపించేలా ఉండటానికి చంద్రబాబు, ఎన్టీఆర్ ఫొటోలు కూడా పెట్టారు.ఏదో విధంగా లోకేష్ పాదయాత్రలో ఇబ్బందిపెట్టాలన్నది వారి నైజం.

    ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఇలా వెలిశాయో లేదో.. నీలి మీడియా చాలా ఫాస్ట్ గా రియాక్టయ్యింది. ఇవన్నీ టీడీపీ హార్ట్ కోర్ ఫ్యాన్స్ పెట్టారని నమ్మబలికేలా వార్తలు ప్రచురించింది. అయితే ఫ్లెక్సీలు ఎక్కడ? ఎవరు ఫ్రింట్ చేశారో ఇట్టే తెలిసిపోతుంది. టీడీపీ నేతలు అనుమానంతో ఆరాతీయగా బాలినేని ప్రణీత్ రెడ్డి అనుచరులది ఈ పని అంటూ తేలిపోయింది. దీంతో జగన్ సీఎం అవుతాడని నమ్మకం లేక ఇటువంటి పోస్టర్లు పెడతారా? అంటూ సెటైర్లు పడుతున్నాయి. లోకేష్ ను ఎదుర్కోవడం జగన్ వల్ల కాదని.. అందుకే మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ ను తెస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు.