CM Chandhrababu : తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీపై ఫోకస్ పెట్టారు చంద్రబాబు. ఏపీలో అధికారంలోకి రావడంతో తెలంగాణపై దృష్టి పెట్టారు. అక్కడ నూతన అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు ప్రారంభించారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఉభయ రాష్ట్రాలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. 1995 నాటి సీఎంను చూస్తారని ఇటీవల కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసింది. అదే విషయాన్ని పొలిట్ బ్యూరో సమావేశంలో సైతం చంద్రబాబు గుర్తు చేశారు. గతంలో సక్సెస్ అయిన జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. నామినేటెడ్ పదవులపై సైతం నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చినందున తెలంగాణ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని అక్కడి నేతలు చంద్రబాబును కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల నియామకం విషయంలో సైతం తెలంగాణను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జన్మభూమి కార్యక్రమం విజయవంతమైన సంగతిని గుర్తు చేశారు. అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహద పడింది అన్నారు. ఎన్నారైలు, ప్రజలను భాగస్వామ్యులను చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. త్వరలోనే మంత్రులతో చర్చించి జన్మభూమి కార్యక్రమం ప్రారంభం.. అమలుపై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. 1995ను గుర్తుకు తెచ్చేలా పనిచేస్తానని స్పష్టం చేశారు చంద్రబాబు.
* గత ఐదేళ్ల పోరాటం పై మననం
ఏపీలో తెలుగుదేశం పార్టీ పోరాటం చేసిన తీరును ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. 2019లో 23 అసెంబ్లీ సీట్లకే పరిమితమయ్యామని.. కానీ మొక్కవోని దీక్షతో గత ఐదు సంవత్సరాలుగా ప్రజా పోరాటం చేశామని.. కలిసి వచ్చిన టిడిపి శ్రేణులను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా సంక్షోభ, విజయాలు చవి చూడలేదని.. పడిలేచిన కెరటంగా టిడిపి తెలుగు నాట నిలిచిపోయిందన్నారు.ఇదే స్ఫూర్తితోతెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీపూర్వ వైభవం సాధించాలని ఆకాంక్షించారు.
*:తెలంగాణ పై ఫోకస్
తెలంగాణలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ఎన్నికలకు ముందు రాజీనామా చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పుకోవడంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. కెసిఆర్ పార్టీలో చేరారు. అప్పటినుంచి పార్టీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. దేవేందర్ గౌడ్ మేనల్లుడు అరవింద్ కుమార్ గౌడ్ కు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయం పోలిట్ బ్యూరో సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. వీలైనంత త్వరగా తెలంగాణ అధ్యక్ష పదవిని భర్తీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
*టీటీడీలో భాగస్వామ్యం
ఇటీవల తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ తో చంద్రబాబు సమావేశమైన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనకు సంబంధించి సమస్యల పరిష్కారానికి సానుకూలంగా చర్చలు జరిపారు. ఈ క్రమంలో టీటీడీలో తమకు సైతం స్థానం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి విన్నపం వచ్చింది. ఈ తరుణంలో పొలిట్ బ్యూరో సమావేశంలో తెలంగాణ టిడిపి నేతలు ప్రస్తావించగా.. టిటిడి బోర్డులో కూటమి పార్టీలకు చెందిన నేతలకు సభ్యులుగా ఛాన్స్ ఇస్తామని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఇంకా పార్టీ సజీవంగానే ఉందని.. దానిని తట్టి లేపాల్సిన బాధ్యత నేతల దేనిని చంద్రబాబు తేల్చి చెప్పారు. మొత్తానికి అయితే జన్మభూమితోపాటు తెలంగాణ పార్టీ విషయంలో కీలక నిర్ణయాలు దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More