Janasena Votebank Strategy: ఏ రాజకీయ పార్టీ కైనా సంప్రదాయ ఓటు బ్యాంక్ అనేది కీలకం. గెలుపు, ఓటములు అనేది సహజం అయినా.. పార్టీ మనుగడకు సంప్రదాయ ఓటు బ్యాంకు కీలకం. అలా సంప్రదాయ ఓటు బ్యాంకు కలిగిన పార్టీలు రాజకీయంగా కీలక పాత్ర పోషించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కీరోల్ ప్లే చేశాయి. దేశవ్యాప్తంగా చిన్నచితకా పార్టీలు సైతం ఉనికి చాటుకున్నాయంటే దానికి సంప్రదాయ ఓటు బ్యాంకు కారణం. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ దారుణ పరాజయం చవిచూసింది. అయినా 40 శాతం ఓట్లు సాధించింది. అది కేవలం సంప్రదాయ ఓటు బ్యాంకు వల్లే సాధ్యమైంది. అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటును జనసేన వైపు మళ్లించేందుకు పవన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అవి సక్సెస్ అయినట్లు కనిపిస్తున్నాయి.
జనసేన వ్యూహాత్మకంగా..
కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. ప్రధానపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యత్వంలో రికార్డ్ సృష్టించింది. ఎన్నడూ లేనంత సభ్యత్వాన్ని పెంచుకుంది. కానీ ఆ స్థాయిలో ప్రయత్నాలు ఏవి జనసేన నుంచి కనిపించలేదు. అసలు గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసిన దాఖలాలు లేవు. దీనిపై విమర్శలు వచ్చాయి కూడా. కానీ అంతర్గతంగా ఒకటి మాత్రం వాస్తవం. పవన్ కళ్యాణ్ బలమైన వైసీపీ ఓటు బ్యాంకు పై గట్టి దెబ్బ కొట్టారు. గ్రామీణ, గిరిజన ఓటు బ్యాంకు పై దృష్టిపెట్టారు. ఆ రెండు వర్గాలు ఇప్పటివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచాయి. అయితే అధికారంలోకి వచ్చింది మొదలు ఆ వర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు పవన్. ఆ రెండు వర్గాలను దగ్గర చేర్చుకోవడం ద్వారా వైసీపీని దెబ్బతీయడం.. కూటమి అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం పవన్ ముందున్న లక్ష్యంగా తెలుస్తోంది.
Also Read: TDP Eyes Pulivendula: వై నాట్ పులివెందుల.. కుటుంబంతోనే జగన్ కు చెక్!
గ్రామీణ ప్రాంతాలపై సైతం..
ప్రతి ప్రభుత్వానికి ఒక పాలసీ ఉంటుంది. అలాగే వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి కంటే సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యం లభించింది. దీంతో అభివృద్ధి లేకుండా పోయిందన్న విమర్శ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేది. అందుకే పవన్ ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టారు. రహదారులు, కాలువలు, ఇంటింటికి తాగునీరు వంటివి కల్పించడం ద్వారా గ్రామీణుల మనసును గెలిచారు. తనకంటూ ఒక సొంత క్యాడర్ను ఏర్పాటు చేసుకునేందుకు ఈ మార్గం ఎంతో ఉపయోగపడింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన కోటలుగా ఉన్న గ్రామీణ ఓటు బ్యాంకును కూటమికి దఖ లు పడేలా చేయాలన్నది పవన్ వ్యూహం. అందులో కొంత వరకు సక్సెస్ అయ్యారు.
గిరిజన ప్రాంతాలపై ఫోకస్..
ఇక గిరిజన ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టు ఎక్కువ. 2014, 2019 ఎన్నికల్లో ఎస్టీ నియోజకవర్గాల్లో ఏకపక్షంగా గెలుచుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. 2024 ఎన్నికలు వచ్చేసరికి సీన్ మారింది. కూటమి వైపు ఎస్టీ నియోజకవర్గాలు మొగ్గు చూపాయి. అందుకే గిరిజనుల ఓటు బ్యాంకు ను పూర్తిగా జనసేన వైపు టర్న్ చేసేందుకు పవన్.. గిరిజన ప్రాంతాలపై దృష్టి పెట్టారు. ఆ నియోజకవర్గాల్లో రహదారులతో పాటు మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్నారు. వారితో వ్యక్తిగతంగా మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ వర్కౌట్ కావడంతో.. వైసిపి సంప్రదాయ ఓటు బ్యాంకుకు గండిపడే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఎవరి వ్యూహాలకు అందకుండా పవన్ వేసిన ప్లాన్ గట్టిగానే వర్కౌట్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.