Janasena: జనసేన( janasena ) సంచలన నిర్ణయాలను తీసుకుంటోంది. గతానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. క్షేత్రస్థాయి నుంచి బలపడాలని చూస్తోంది. జనసేన ఆవిర్భవించి పుష్కరకాలం అవుతోంది. 2014 ఎన్నికల నాటికి జనసేన ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్. అయితే అప్పటికప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడం సాహసం అని భావించిన ఆయన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి, కేంద్రంలో బిజెపికి మద్దతు తెలిపారు. అయితే అలా ఈ పదేళ్లలో తొలుత అపజయాలు, ఆ తరువాత ఇప్పుడు ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యం లభించింది. అయితే ఈ మొత్తం పరిణామ క్రమంలో ఆ పార్టీ క్షేత్రస్థాయిలో బలపడే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఆ ప్రయత్నంలో ఉంది జనసేన. వార్డు, గ్రామ, పంచాయితీ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఇప్పటివరకు ఉన్న అన్ని కమిటీలను రద్దు చేసింది.
* కమిటీలన్నీ రద్దు..
ప్రస్తుతం జనసేన కార్యదర్శిగా రామ్ తాళ్లూరి( Ram thaalluri) ఉన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఉండగా మరో ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. 21 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్సీలు సైతం కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు ఉన్నఫలంగా ఉన్న కమిటీలను రద్దు చేసింది జనసేన. మొన్ననే ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఉన్న కమిటీలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి వెంట నడిచిన వారికి ఈ కమిటీల్లో ప్రాధాన్యం ఇవ్వనన్నారు. కొత్తవారికి సైతం చోట్టిచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.
* ఆ విమర్శకు చెక్..
జనసేన నాయకత్వం పై ఒక విమర్శ ఉండేది. క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేసే చర్యలు చేపట్టడం లేదన్న అపవాదు ఉండేది. ఎంతవరకు పై స్థాయిలో ముందుకెళ్లడమే తప్ప కిందిస్థాయిలో పట్టించుకోవడంలేదని పవన్ కళ్యాణ్ పై ఎక్కువ మంది ఆవేదనతో ఉండేవారు. కానీ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. ప్రతి వార్డుకు ఇన్చార్జి తో పాటు గ్రామ కమిటీలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీలను నియమించడం ద్వారా జనసేనకు స్పష్టమైన బలం ఉంచుకునేలా చూస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో జనసేనకు ఓట్ల పరంగా మెరుగైన శాతం దక్కింది. సీట్ల పరంగా కూడా శతశాతం విజయం దక్కించుకుంది. అందుకే ఈసారి ఓట్లు పెరగాలి.. సీట్లు పెరగాలని ఆలోచన చేసి కమిటీలను ఏర్పాటు చేసినట్లు స్పష్టం అవుతోంది.