Perni Naani : మాజీ మంత్రి పేర్ని నానికి జనసైనికులు షాక్ ఇచ్చారు. ఆయన ఇంటిని ముట్టడించి గట్టి హెచ్చరికలే పంపారు. తిరుపతి లడ్డు వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై పవన్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు.సనాతన ధర్మ పరిరక్షణకు ఒక వ్యవస్థ అవసరమని భావించారు. తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇంకోవైపు ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నారు. ఈ క్రమంలో పవన్ పై నోరు జారారు మాజీ మంత్రి పేర్ని నాని. భీమవరంలో బాప్టిజం తీసుకున్నారని చెప్పిన పవన్ ఆయనేనా? వన్ టూ సెటైరికల్ గా మాట్లాడారు. పొరపాట్లు చేసిన వాళ్లే ప్రాయశ్చిత్తం చేసుకుంటారని కామెంట్స్ చేశారు. దీనిపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని ఇంటిని ముట్టడించారు.ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. పవన్ ను ఉద్దేశించి పేర్ని నాని చేసిన వ్యాఖ్యల పట్ల వారు నిరసన చేపట్టారు. మచిలీపట్నంలోని పేర్ని నాని ఇంటి వద్ద ఆయన దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించమని జనసైనికులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
* మాజీ మంత్రి ఫైర్
అయితే దీనిపై మాజీమంత్రి పేర్ని నాని స్పందించారు. తన ఇంటి ముట్టడికి జనసైనికులు రావడాన్ని సీరియస్ అయ్యారు. తమ ఇంటికి వాళ్ళ ఇల్లు ఎంత దూరమో.. వాళ్ల ఇంటికి తమ ఇల్లు అంతే దూరమని గుర్తించాలని సూచించారు. సినిమా షూటింగ్స్ తరహాలో రాజకీయాల్లో చేయాలంటే సాధ్యం కాదని కూడా తేల్చి చెప్పారు. కులం, మొత్తం లేదని పార్టీ స్థాపించినప్పుడు చెప్పుకొచ్చిన పవన్.. ఇప్పుడు మొత్తం పేరిట రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇతర మతాలను ప్రస్తావిస్తూ హిందువులు బయటకు రారా అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని పవన్ పై తీవ్రస్థాయిలో కామెంట్స్ చేశారు పేర్ని నాని.
* అందరి టార్గెట్ పవనే
తిరుపతి లడ్డు వ్యవహారం పెను దుమారానికి దారి తీసిన క్రమంలో.. వైసీపీ నేతలు పవన్ ను టార్గెట్ చేసుకోవడం విశేషం. ముఖ్యంగా పేర్ని నాని అదే పనిగా పవన్ పై విమర్శలు చేస్తున్నారు. దీనిని తిప్పికొట్టే క్రమంలో జనసైనికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అందులో భాగంగానే పేర్ని నాని ఇంటిని ముట్టడించారు. అయితే ఇటువంటి బెదిరింపులకు లొంగే ప్రసక్తి లేదని.. భయపడమని.. వైసీపీ శ్రేణులు తిప్పి కొడతాయని తేల్చి చెప్పారు.