Bigg Boss Telugu 8 : ఇటీవలే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చూసే ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ ట్విస్టు ఇస్తూ, హౌస్ లోకి 12 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారని, కానీ వాళ్ళు లోపలకు వస్తే కచ్చితంగా హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్లే అవకాశం ఉంటుందని, కాబట్టి వాళ్ళను హౌస్ లోకి రాకుండా అడ్డుకునేందుకు మీకు ‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్’ టాస్కులు నిర్వహిస్తామని,గెలిచిన ప్రతీ సారి లక్ష రూపాయిలు గెలుచుకోవడమే కాకుండా, ఒక్కో వైల్డ్ కార్డు ఎంట్రీ ని తొలగించవచ్చని బిగ్ బాస్ చెప్తాడు. ఇప్పటి వరకు 5 టాస్కులు ఆడగా, అందులో రెండు టాస్కులు శక్తి క్లాన్ గెలవగా, ఒక టాస్కుని కాంతారా టీం గెలుస్తుంది. మిగిలిన రెండు టాస్కులు ఇరు క్లాన్స్ ఓడిపోతాయి. దీంతో 12 మంది వైల్డ్ కార్డు ఎంట్రీలలో ముగ్గురుని తప్పిస్తారు కంటెస్టెంట్స్.
అయితే ‘సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్’ టాస్క్ ఇక్కడితో అయిపోయిందని బిగ్ బాస్ అంటాడు. దీంతో కంటెస్టెంట్స్ అందరూ ఆశ్చర్యపోతూ ‘అంటే ఇప్పుడు 9 మంది వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారా’ అని అంటారు. ఈ విషయం పై బిగ్ బాస్ కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ వారం మొత్తం 12 టాస్కులు పెడతారని కంటెస్టెంట్స్ ఊహించారు. కానీ కేవలం 5 టాస్కులతో ముగించేసరికి అయ్యోమయ్యం కి గురయ్యారు కంటెస్టెంట్స్. రేపు కూడా ఈ టాస్కులు కొనసాగుతాయా?, లేదా వచ్చే వారం లో కొనసాగుతాయా అనేది తెలియాల్సి ఉంది. ఇదంతా పక్కన పెడితే ఒకవేళ 9 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేది ఫిక్స్ అయితే, ఆ 9 మంది ఎవరు? అనే దానిపై సోషల్ మీడియా లో సర్వత్రా చర్చలు నడుస్తున్నాయి. ముక్కు అవినాష్, హరి తేజ, రోహిణి, నయని పావని వంటి వారు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వస్తున్నారు అనేది దాదాపుగా ఖరారు అయిపోయినట్టే. వీళ్ళు కాకుండా ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ లో కూడా ఎవరో ఒకరు రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందట.
నూటికి 99 శాతం శేఖర్ బాషా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అవ్వలేదు. కంటెస్టెంట్స్ ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ రూల్స్ లో కంటెస్టెంట్స్ ద్వారా ఎలిమినేట్ అయ్యే పద్దతి లేదు. కాబట్టి ఈయన రీ ఎంట్రీ దాదాపుగా ఖరారు అయ్యినట్టే అని అంటున్నారు. అలాగే సీజన్ 4 కంటెస్టెంట్స్ లో ఒకరైన యాంకర్ రవి, సీజన్ 2 నుండి దీప్తి సునైనా వంటి వారు హౌస్ లోకి రాబోతున్నారు. వీళ్ళు కాకుండా రీతూ చౌదరీ, జ్యోతి రాయ్ వంటి కొత్త కంటెస్టెంట్స్ ని కూడా హౌస్ లోకి పంపే అవకాశం ఉంది, మరి ఏమి జరగబోతుంది అనేది తెలియాలంటే అక్టోబర్ 4 వరకు ఆగాల్సిందే.