Mokshajna : నందమూరి నటసింహంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య బాబు (Balayya Babu) తన నట వారసుడు అయిన మోక్షజ్ఞ(Mokshagna) ని సినిమా ఇండస్ట్రీకి తీసుకురావాలని చాలా సంవత్సరాల నుంచి ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక ఎప్పటికప్పుడు ఈ సంవత్సరం మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య బాబు చెబుతూ వస్తున్నప్పటికి ఇప్పటివరకు కార్యరూపం అంటే దాల్చలేదు. ఈ సంవత్సరం మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుందంటూ ప్రశాంత్ వర్మ (Prashanth varma) ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తారని కూడా బాలయ్య బాబు చెప్పాడు. అయినప్పటికీ ఆ సినిమా ఇంకా సెట్స్ మీదకి అయితే వెళ్లలేదు. ఇక గత రెండు నెలల క్రితం మోక్షజ్ఞ లుక్ చాలా అద్భుతంగా ఉన్నప్పటికి ఇప్పుడు మోక్షజ్ఞ లుక్ కనక చూసినట్లయితే గడ్డం పెంచుకొని చాలా రగ్గుడ్ గా కనిపిస్తున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే మళ్ళీ అతను షేప్ అవుట్ అవ్వడానికి రెడీ అయిపోయాడు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన కనక తన షేప్ ను కోల్పోతే మళ్ళీ డైట్, ఎక్సర్సైజులు చేసి స్లిమ్ అవడానికి మరికొంత సమయం పట్టే అవకాశమైతే ఉంది. కాబట్టి ప్రశాంత్ వర్మ ఇతనితో సినిమా చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ విషయానికి వచ్చేసరికి మాత్రం ఎందుకు వెనుకడుగు వేస్తున్నాడు.
తన వల్లే మోక్షజ్ఞ సినిమా లేట్ అవుతుంది అంటూ నందమూరి అభిమానులు అతని మీద చాలావరకు సీరియస్ అవుతున్నారు. ఇక ఎందుకని ఆయన ఇలా చేస్తున్నాడు అనే విషయాల మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ఇక ఒకానొక సందర్భంలో వీళ్ళ కాంబోలో సినిమా రావడం లేదు క్యాన్సిల్ అయిపోయిందనే వార్తలు కూడా వినిపించాయి.
ఇక నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ తన మొదటి సినిమా చేయబోతున్నాడు అంటూ మరికొన్ని వార్తలు కూడా వినిపించాయి. ఇక ఏది ఏమైనా కూడా అసలు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఈ సంవత్సరమైనా ఉంటుందా లేదా అంటూ నందమూరి అభిమానులు సైతం ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సంవత్సరం మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
ఇప్పటికే వరుసగా నాలుగో విజయాన్ని అందుకున్న బాలయ్య ఇక ‘అఖండ 2’ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి కూడా సిద్ధమవుతున్నాడు. ఇక రీసెంట్ గా పద్మభూషణ్ అవార్డుని అందుకున్న ఆయన ఇక మొదట చేయబోయే సినిమాలతో కూడా సక్సెస్ లను సాధించి ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…