Homeఆంధ్రప్రదేశ్‌Pavan Kalyan  Birthday  : పుట్టినరోజు నాడు పవన్ కు జనసేన బంపర్ గిఫ్ట్

Pavan Kalyan  Birthday  : పుట్టినరోజు నాడు పవన్ కు జనసేన బంపర్ గిఫ్ట్

Pavan Kalyan  Birthday :పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటే మామూలుగా ఉండదు. పార్టీ శ్రేణులు, అభిమానులు వేడుకగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ బర్త్ డే ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆ పార్టీ మంచి విజయాన్ని అందుకుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అందుకు ఈసారి బర్త్ డే వేడుకలకు సంబంధించి సన్నాహాలు ముందుగానే ప్రారంభమయ్యాయి. పార్టీ క్యాడర్ తో పాటు అభిమానులు ఉత్సాహంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెగా కుటుంబం నుంచి అరుదైన గౌరవం దక్కించుకున్నారు పవన్. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఎంట్రీ ఇచ్చినా రాజకీయాల్లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. కానీ పవన్ అలా కాదు. సుదీర్ఘకాలం పార్టీని నడిపారు. ప్రజలను మెప్పించారు. అధికారంలోకి రాగలిగారు. ఆ కుటుంబానికి సాధ్యపడని విషయాన్ని సుసాధ్యం చేశారు. మెగా అభిమానుల్లో ఒక రకమైన గర్వాన్ని నింపారు. అందుకే పవన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయాలని అభిమానులు డిసైడ్ అయ్యారు.

* పాలనలో పవన్ ముద్ర
పవన్ డిప్యూటీ సీఎం తో పాటు నాలుగు కీలక మంత్రిత్వ శాఖలను దక్కించుకున్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖతో పల్లెలను మార్చాలని భావించారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయితీల్లో గ్రామసభలను ఏర్పాటు చేశారు. ప్రజలకు అవసరమైన పనులను వారి నుంచే అభిప్రాయాలను సేకరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామసభలను ఏర్పాటు చేయడంతో ప్రజలు కూడా సంతోషించారు. తమకు అవసరమైన పనులు చేపట్టాలని సూచించారు.

* గ్రామసభల ఆలోచన పవన్ దే
గ్రామసభల ఆలోచన పవన్ కళ్యాణ్ దేనని సీఎం చంద్రబాబు కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు గ్రామ సభలకు వచ్చిన ఆదరణ చూసిన జనసైనికులు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటాలని నిర్ణయించారు. దీనికి క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అని పేరు పెట్టారు. జనసేన క్యాడర్ విధిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.

* జనసేన ప్రత్యేక ప్రకటన
జనసేన ప్రత్యేక ప్రకటన చేసింది. మొక్కల నాటే కార్యక్రమం వెనుక ఉన్న ఉద్దేశాన్ని చెప్పుకొచ్చింది. ఒక మొక్క రెండు తరాలకు సరిపడే ఆక్సిజన్, పండ్లు, ఔషధ ఫలాలను అందిస్తుందని, పర్యావరణాన్ని సమతుల్యం చేస్తుందని జనసేన పేర్కొంది. పవన్ కళ్యాణ్ కు పాము ఇచ్చే నిజమైన జన్మదిన బహుమతి అదేనని, భావితరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందిద్దామని కోరింది. సగటు మనిషి జీవితకాలం 67 సంవత్సరాలు కాగా.. ఉసిరి చెట్టు 70, నేరేడు చెట్టు 100, చింత చెట్టు 100, వేపచెట్టు 200, రావి చెట్టు 2500 సంవత్సరాల పాటు జీవించగలుగుతాయని వివరించింది.అందుకే పవన్ పుట్టినరోజు నాడు మొక్కలు నాటాలని సూచించింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version