https://oktelugu.com/

Akkineni Nagarjuna : రజినీకాంత్ సినిమాలో విలన్ గా అక్కినేని నాగార్జున..ఫస్ట్ లుక్ అదిరిపోయింది!

సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అంటూ ఒక ట్వీట్ ద్వారా తెలిపాడు. మరి ఇప్పటి వరకు మనం ఎవ్వరూ కూడా చూడని నాగార్జున లోని సరికొత్త కోణాన్ని లోకేష్ కనకరాజ్ ఎలా ఆవిష్కరిస్తాడో చూడాలి.

Written By:
  • Vicky
  • , Updated On : August 29, 2024 / 07:51 PM IST

    Akkineni Nagarjuna

    Follow us on

    Akkineni Nagarjuna : ఒకప్పుడు స్టార్ హీరోలు మల్టీస్టార్రర్ సినిమాలు చేసేందుకు చాలా భయపడేవారు. ఎందుకంటే అభిమానుల మనోభావాలు నొచ్చుకుంటాయేమో, కాస్త మా పాత్రని తగ్గించినా వాళ్ళు తట్టుకోలేరు అనే భావనతో అలాంటి సినిమాలు చూసే అదృష్టం నిన్నటి తరం ఆడియన్స్ కి రాలేదు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులకు తగ్గట్టుగా, తమ అభిమాన హీరోలను డిఫెరెంట్ పాత్రలలో చూసేందుకు ఇష్టపడుతున్నారు. అందుకే ఇప్పుడు మల్టీస్టార్రర్ సినిమాలు వరుసగా వస్తున్నాయి. కొంతమంది హీరోలు అయితే నెగటివ్ రోల్స్ చెయ్యడానికి కూడా రెడీ అయిపోతున్నారు. ఉదాహరణకి తమిళ హీరో విజయ్ సేతుపతి మంచి సక్సెస్ ట్రాక్ లో ఉన్నప్పుడే ఇతర హీరోల సినిమాల్లో నెగటివ్ రోల్స్ చెయ్యడానికి సిద్దమయ్యాడు.

    ఆ పాత్రలకు అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది. అలాగే లోకేష్ కనకరాజ్ దర్శకత్వం లో కమల్ హాసన్ హీరో గా నటించిన ‘విక్రమ్’ చిత్రం లో, సౌత్ సూపర్ స్టార్స్ లో ఒకరైన సూర్య ‘రోలెక్స్’ అనే నెగటివ్ క్యారెక్టర్ చేసాడు. ఆయన కనిపించింది కేవలం 5 నిమిషాలే అయినప్పటికీ కూడా కమల్ హాసన్ ని డామినేట్ చేసేసాడు. అలాగే కమల్ హాసన్ కూడా ఈ ఏడాది విడుదలైన ‘కల్కి’ చిత్రంలో నెగటివ్ రోల్ చేసాడు. త్వరలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ‘వార్ 2’ చిత్రం ద్వారా నెగటివ్ రోల్ తో మన ముందుకు రాబోతున్నాడు. ఇప్పుడు ఈ హీరోల జాబితాలో అక్కినేని నాగార్జున కూడా చేరిపోయాడు. లోకేష్ కనకరాజ్, రజినీకాంత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘కూలీ’ చిత్రం లో నాగార్జున విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఆయన కెరీర్ లో ఇదే తొలిసారి నెగటివ్ రోల్ చెయ్యడం. సరైన కథ దొరికితే నెగటివ్ రోల్ లో నటించేందుకు నేను ఎప్పటికీ సిద్దమే అని ఆయన స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే ప్రకటించాడు, ఇప్పుడు ప్రతిష్టాత్మక చిత్రంలో నెగటివ్ రోల్ చేసే అవకాశం దక్కింది. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా లోకేష్ కనకరాజ్ నాగార్జున కి శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసాడు. ఇందులో నాగార్జున ‘సిమోన్’ అనే క్యారక్టర్ లో కనిపించబోతున్నట్టు లోకేష్ కనకరాజ్ తెలిపాడు.

    ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘ఖైదీ చిత్రం చూసినప్పటి నుండి లోకేష్ దర్శకత్వం లో నటించాలని అనుకుంటూ ఉన్నాను. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది. సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ ఒక ట్వీట్ ద్వారా తెలిపాడు. మరి ఇప్పటి వరకు మనం ఎవ్వరూ కూడా చూడని నాగార్జున లోని సరికొత్త కోణాన్ని లోకేష్ కనకరాజ్ ఎలా ఆవిష్కరిస్తాడో చూడాలి. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు మరి కొద్దిరోజుల్లోనే తెలియనుంది. ప్రస్తుతం రజినీకాంత్ ‘వెట్టియాన్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ‘కూలీ’ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.