Homeఆంధ్రప్రదేశ్‌Jagan manifesto: మేనిఫెస్టో ప్రకటన తర్వాత జగన్ గ్రాఫ్ పడిపోయిందా?

Jagan manifesto: మేనిఫెస్టో ప్రకటన తర్వాత జగన్ గ్రాఫ్ పడిపోయిందా?

Jagan manifesto: వైసీపీ మేనిఫెస్టో ప్రకటన తర్వాత సీన్ మారుతోంది. జగన్ చేసింది చెబుతారు.. చెప్పింది చేస్తారు అని వైసిపి నేతలు తరచూ చెబుతుంటారు. గత మేనిఫెస్టోలో ప్రకటించినవి 99% పూర్తి చేశారన్నది వైసిపి నుంచి వినిపించే మాట. దీంతో ఈ మేనిఫెస్టో పై సామాన్య జనాలతో పాటు వైసీపీ శ్రేణులు కూడా ఆశలు పెట్టుకున్నాయి. అయితే సహజంగానే జగన్ నుంచి సంక్షేమాన్ని ఆశిస్తారు. అయితే గత మేనిఫెస్టోకే కొద్దిపాటి కేటాయింపులు పెంచి.. చిన్న చిన్న మార్పులతో కొత్త మేనిఫెస్టో ప్రకటించారు. అయితే భారీ కేటాయింపులు లేకపోవడం, గత మేనిఫెస్టోలో చేర్చి అమలు చేయకపోయిన వాటి గురించి జగన్ ఎటువంటి ప్రస్తావన చేయలేదు. పైగా డ్వాక్రా, వ్యవసాయ రుణమాఫీ వంటి విషయాల జోలికి పోలేదు. దీంతో అప్పటినుంచి వైసీపీలోనే ఒక రకమైన చర్చ నడుస్తోంది. జనం నుంచి కూడా టాక్ మారిపోయింది. మద్య నిషేధం లేదు. సిపిఎస్ రద్దు చేయలేదు. జాబ్ క్యాలెండర్ లేదు. మెగా డీఎస్సీ ప్రకటించలేదు. అయితే ఇవన్నీ పాత మేనిఫెస్టోలోనివే.

వాస్తవానికి మేనిఫెస్టో ప్రకటనకు ముందు వైసిపి గ్రాఫ్ ఒకలా ఉండేది. కానీ ప్రకటించాక పరిస్థితి మారింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తటస్తులు, మేధావులు, విద్యావంతులు ఒక రకమైన ఆలోచన చేయడం ప్రారంభించారు. కనీసం కేంద్రంతో పోరాడి సాధించే విషయాలైనా మేనిఫెస్టోలో పెడతారు కదా అన్న ప్రశ్న ఉత్తనమౌతోంది. కనీసం ప్రత్యేక హోదా గురించి ప్రస్తావన లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం గురించి మేనిఫెస్టోలో పొందుపరచలేదు. కడప ఉక్కు పరిస్థితి ఏంటనేది చెప్పలేదు.

జగన్ కు సంక్షేమ సామర్థ్యం తగ్గింది అన్నది ఈ మేనిఫెస్టో ద్వారా బయటపడింది. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయగలదా అన్న అనుమానం ప్రారంభమైంది. ఎందుకంటే భారీ సంక్షేమ పథకాలు ఉంటాయనిఅంతా భావించారు.పోనీ ఈసారి సంక్షేమాన్ని పక్కన పెట్టి అభివృద్ధి చేస్తానని చెప్పే సాహసం కూడా చేయలేదు. అయిందేదో అయింది.. ఈసారి గెలిస్తే తప్పకుండా మెగా డీఎస్సీ ప్రకటిస్తానని, కనీసం ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తానని, ఉద్యోగ,ఉపాధ్యాయులను ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా చేస్తానని జగన్ చెప్పలేకపోయారు. అయితే మేనిఫెస్టో ప్రకటనలో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో అందరిలో అంచనాలు పెరిగాయి. కానీ ప్రజల అంచనాలను అందుకోలేక.. తూతూ మంత్రంగా మేనిఫెస్టో ప్రకటించినట్లు అయ్యింది. అయితే ఒకటి మాత్రం నిజం. మేనిఫెస్టో ప్రకటన తర్వాత జగన్ గ్రాఫ్ పడిపోయినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular