YS Jagan Foriegn Tour : జగన్ విదేశీ పర్యటన ఉంటుందా? లేదా? వాయిదా వేసుకున్నారా? పూర్తిగా రద్దు చేసుకున్నారా? వైసిపి శ్రేణులకు సైతం ఇది అంతుపట్టడం లేదు. జగన్ లండన్ పర్యటనకు సంబంధించి సిబిఐ కోర్టు నుంచి ఆయనకు అనుమతి లభించింది. ఈనెల మూడు నుంచి 25 వరకు లండన్ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టుపాస్పోర్ట్ రెన్యువల్ విషయంలో తెలిపిన అభ్యంతరాలతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.హైకోర్టు తీర్పు రావాల్సి ఉంది.ఇప్పటికే ఆయన లండన్ పర్యటనకు సంబంధించి రెండు వారాలు వాయిదా పడింది. దీంతో తక్కువ సమయం ఉండడంతో అసలు వెళ్తారా? లేదా? అన్నది క్లారిటీ రావడం లేదు. మరోవైపు కుమార్తె పుట్టినరోజు కనిపిస్తోంది.ఆ కారణం చెప్పే జగన్ విదేశాలకు వెళుతున్నట్లు కోర్టుకు అర్జీ పెట్టుకున్నారు.మధ్యలో విజయవాడ వరదలు,పాస్పోర్ట్ వివాదం తదితర కారణాలతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
* దూకుడు పెంచిన జగన్
జగన్ దూకుడు పెంచారు.వరుసగా పార్టీ శ్రేణులతో తాడేపల్లిలో సమావేశం అవుతున్నారు.పార్టీ ప్రక్షాళన పై దృష్టిపెట్టారు.జిల్లా అధ్యక్షులను మార్చుతున్నారు.కొత్తవారికి ఇంచార్జ్ పదవులు కట్టబెడుతున్నారు.అదే సమయంలో వైసీపీ తరఫున మీడియా సమావేశంలో మాట్లాడే 14 మందిని ఎంపిక చేశారు.తాజాగా యాంకర్ శ్యామలతో పాటు నలుగురిని పార్టీ అధికార ప్రతినిధులుగా ప్రకటించారు.
* ఇది తొమ్మిదో సారి
అయితే తాజాగా జగన్ బెంగళూరు వెళ్ళిపోయారు.తరచూ ఆయన బెంగుళూరు వెళ్తుండడం వివాదంగా మారుతోంది. ఇటువంటి తరుణంలో ఆయన తొమ్మిదో సారి బెంగుళూరు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. బెంగళూరులోని ఆయన ప్యాలెస్ కుతరచూ కాంగ్రెస్ నేతలు వస్తున్నారని ప్రచారం జరుగుతోంది.జగన్ కాంగ్రెస్ తో జతకట్టనున్నారని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలోనే జగన్ సైతం బెంగళూరు బాట పడుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
* అక్కడ అయితే సేఫ్ జోన్
తాడేపల్లి లో ఉంటూ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. ఎటువంటి సమావేశాలు జరిపినా ఎల్లో మీడియాకు ఇట్టే లీక్ అయిపోతున్నాయి. అందుకే జగన్ జాగ్రత్త పడుతున్నారు. తాడేపల్లి లో ఉంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని భావిస్తున్నారు. బెంగళూరు అయితే ఎటువంటి ఇబ్బందులు రావని అంచనా వేస్తున్నారు. వైసిపి ఓడిపోయిన తర్వాత నేతలంతా బెంగళూరు వెళ్ళిపోయారు. అందుకే హైదరాబాద్ కంటే బెంగళూరు సేఫ్ జోన్ అని భావించి జగన్ వెళుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ విదేశీ పర్యటనపై క్లారిటీ రాకపోగా.. ఇప్పుడు బెంగళూరులోనే వ్యూహాలు రూపొందిస్తుండడం.. స్ట్రాటజీ మారినట్లు కనిపిస్తోంది.