Ganapathi Boppa Morya : వినాయకుని పూజలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. అయితే వినాయకుని గణపతి బొప్పా మోరియా అనడానికి వెనుక ఓ పెద్ద స్టోరీ ఉంది. 15వ శతాబ్దంలో మోరియా గోసావి అనే ఒక సాధువు ఉండేవాడు. అయితే అతను పూణెకు 21 కి.మీ. దూరంలో ఉన్న చించ్‌వాడి అనే గ్రామంలో జీవించేవాడు.ఆ సాధువు గణపతికి పెద్ద భక్తుడు. అయితే గణపతిని పూజించడానికి అతను చించ్‌వాడి నుంచి రోజూ కాలినడకన మోరేగావ్ వరకు వెళ్లేవాడు. ఇలా ఒకరోజు మోరియా నిద్ర పోతుండగా గణపతి కలలోకి వచ్చాడు. మోరియాకి దగ్గరలో ఉన్న ఒక నదిలో విగ్రహం ఉంటుందని.. దానిని తీసుకుని వచ్చి ప్రతిష్ఠించమని కల వచ్చింది. అయితే ఇది నిజమో కాదో అని తెలుసుకోవడానికి అక్కడికి వెళ్లి చూడగా నిజంగానే విగ్రహం కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న అక్కడ వాళ్లంతా మోరియాని చూడటానికి వెళ్లారు. అతను చాలా గొప్పవాడు. అందుకే అతనికి కలలో విగ్రహం కనిపించిదని అంటారు. అతన్ని చూడటానికి భక్తులు భారీ సంఖ్యలో వస్తారు. అలా అందరూ అతని కాలు మొక్కి.. మోరియా అనడం మొదలు పెట్టారు. దీంతో అందరూ మోరియా అనేవారు. నదిలో దొరికిన విగ్రహాన్ని మోరియా గుడి కట్టి ప్రతిష్టించారు. గణపతికి మోరియా చాలా పెద్ద భక్తుడని అందరూ కూడా వినాయకుని ఉత్సవాల్లో మోరియా పేరు పలుకుతారు. ఇలా నిమజ్జన సమయంలో, వినాయకుని ఉత్సవాల్లో గణపతి బొప్పా మోరియా అనే పిలవకుండా అయితే అసలు ఉండరు. అయితే ఈ విగ్రహం పూణే నదిలో దొరికినందున వినాయకుని నిమజ్జనం చేసేటప్పుడు.. గణపతి బప్పా మోరియా పూడ్చ వర్సీ లౌకర్ యా అని మరాఠి భాషలో అంటుంటారు.
కర్ణాటకలోని బీదర్ కు చెందిన వామన్ భట్, ఉమాబాయ్ ల కుమారుడు మోరియా గోసావి. వీళ్లు గణేసుడిని చాలా భక్తితో కొలిచేవారు. పెళ్లి అయిన ఎన్నో ఏళ్లకు వాళ్లకు కుమారుడు జన్మించడంతో అతనికి మోరియా అని పేరు పెట్టుకున్నారు. అలా మొరియాకి చిన్నప్పటి నుంచి గణపతి అంటే చాలా భక్తి ఉండేదని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే కొందరు గణపతి బొప్పా మోరియా అనడానికి కారణం వేరేది కూడా ఉందని అంటుంటారు. మరి వీటిలో నిజాలు ఏంటో ఇంకా పూర్తిగా తెలియదు. మన పురాణాలు బట్టి చెప్పడం జరిగింది.