Homeఆంధ్రప్రదేశ్‌Jagan vs Pawan News: జగన్ వెనక్కి.. తగ్గనంటున్న పవన్!

Jagan vs Pawan News: జగన్ వెనక్కి.. తగ్గనంటున్న పవన్!

Jagan vs Pawan News: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జనసేనకు( Jana Sena ) విజయం దక్కింది. 2019లో అయితే ఆ పార్టీకి డిజాస్టర్ ఫలితాలు వచ్చాయి. 2014 ఎన్నికల్లో టిడిపికి మద్దతు తెలిపి పోటీ చేయలేదు జనసేన. 2024 వరకు ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొంది ఆ పార్టీ. అయితే ఒక్కటి మాత్రం నిజం. గెలుపోటములతో సంబంధం లేకుండా ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ పవన్ అన్నట్టు ఉండేది. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తరువాత పూర్తిగా సీన్ మారిపోయింది. నాడు జగన్ పై విరుచుకుపడేవారు పవన్. పవన్ పై జగన్ తో పాటు వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేసేవారు. ఈ క్రమంలో పవన్ సైతం స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యేవారు. వారాహి సభలతో పాటు జిల్లాల పర్యటన సమయంలో జగన్ పాలనను ఎండగట్టేవారు. మంత్రులపై సైతం విరుచుకుపడేవారు. ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కేస్తానని శపధం చేశారు. అనుకున్నది చేసి చూపించారు.

మారిన పవన్ తీరు..
అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్( deputy CM Pawan) తీరు స్పష్టంగా మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మాటల తీవ్రత తగ్గింది. జగన్మోహన్ రెడ్డి పై కూడా వ్యాఖ్యలు తగ్గించారు. అయితే ఏడాది తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు జగన్మోహన్ రెడ్డి జనాల మధ్యకు వస్తున్నారు. చంద్రబాబుతో పాటు లోకేష్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవన్ విషయాన్ని ప్రస్తావించడం లేదు. పవన్ సైతం సైలెంట్ గా ఉండడంతో రకరకాల కథనాలు నడిచాయి. కూటమి ప్రభుత్వంపై అసంతృప్తితో పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

Also Read:  Pawan vs Jagan : పవన్ పై జగన్ ఆ రెండు బ్రహ్మాస్త్రాలు

జగన్ ఆ ఇద్దరిపై గురి..
అదే సమయంలో కూటమి ప్రభుత్వంతో( alliance government ) పాటు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహంతో వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత దూరంలో ఉన్నా వెనక్కి తెచ్చి మరి శిక్షిస్తామని జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ లు ఇస్తున్నారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి పవన్ ప్రస్తావన తీసుకోకపోవడం.. పవన్ సైతం తన పని తాను చేసుకోవడంతో.. ఇక వారి మధ్య అంత మాటల యుద్ధం ఉండదని అంతా భావించారు. అయితే ఈ రకమైన ఊహాగానాలకు చెక్ పెడుతూ పవన్ గతం మాదిరిగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. తొక్కినార తీస్తామని.. మక్కెలు విరగగొట్టి కూర్చోబెడతామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. పాత పద్ధతిలోనే మూడో కన్ను తెరిచారు. అంతేకాదు కూటమి ఐక్యతకు తాను ప్రాధాన్యం ఇస్తానని.. మరో 20 సంవత్సరాలు కూటమే ఉంటుందని స్పష్టం చేశారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular