Hyderabad IT: హైదరాబాద్ దేశంలో బెంగళూరు తర్వాత ఐటీరంగం అత్యధికంగా అభివృద్ధి చెందిన నగరం. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడి నుంచే పనిచేస్తున్నాయి. ఐటీని ప్రోత్సహించడానికి ప్రస్తుత పాలకులు కృషి చేస్తున్నారు. అయితే ఐటీ హైదరబాద్‌కుఆవడానికి ఆద్యుడు ఎవరు అన్న సందేహం ఇప్పటికీ చాలా మందిలో ఉంది. చంద్రబాబునాయుడు తరచూ హైదరాబాద్‌కు ఐటీ తెచ్చింది తానే అని చెబుతారు. కానీ విపక్ష నేతలు ఖండిస్తారు.
అసలు ఏం జరిగింది?
1980 చివర్లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఐటీపై దృష్టి పెట్టారు. 1986లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ (డీవోఈ) ద్వారా సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్ పాలసీలు తీసుకొచ్చారు. శ్యామ్ పిట్రోడా సలహాలతో టెక్నాలజీ మిషన్లు ప్రారంభించారు. 1991లో పీవీ నర్సింహారావు ఎస్‌టీపీ(సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్‌లు)లను ఏర్పాటు చేశారు. ఫలితంగా 1991లో ముంబై, బెంగళూరులో మొదటి ఎస్‌టీపీలు అమలయ్యాయి.
జనార్దన్ రెడ్డి కాలంలో శంకుస్థాపన..
నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 1990 డిసెంబర్ నుంచి 1992 అక్టోబరు వరకు సీఎంగా ఉండగా, 1991లో రాజీవ్ గాంధీ టెక్నోపార్క్‌కు శంకుస్థాపన చేశారు. అయితే, ఎస్‌టీపీ అమలు లేదా ఐటీ కంపెనీల ఆకర్షణకు చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ లోతల్లో పదవి రాజకీయాలు ప్రధాన్యత పొందాయి. హైటెక్ సిటీ నిర్మాణం లేదా విస్తరణ జనార్దన్ కాలంలో జరగలేదు.
చంద్రబాబు పోకస్..
1995లో చంద్రబాబు నాయుడు సీఎంగా అయ్యాక ఐటీ రంగాన్ని వేగవంతం చేశారు. 1997లో టెక్నోపార్క్‌ను హైటెక్ సిటీగా మార్చి ఎల్‌అండ్‌టీ అప్పగించారు. 1998లో ఎస్‌టీపీ ఏర్పాటుతో మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి అమెరికన్ కంపెనీలు చేరాయి. 1999లో సైబర్ టవర్లు ప్రారంభమయ్యాయి. విదేశీ పెట్టుబడులు ఆకర్షించి 2000 నాటికి హైదరాబాద్ ఐటీ హబ్‌గా ఎదిగింది. ‘విసియన్ 2020‘ ప్లాన్‌తో డిజిటల్ ఇన్‌ఫ్రా, శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తప్పుడు ప్రచారం..
జనార్దన్ రెడ్డికి హైటెక్ సిటీ నిర్మాణం లేదా ఐటీ ప్రారంభకుడని ప్రచారాలు తప్పు. శంకుస్థాపన చేసినందుకు క్రెడిట్ తీసుకున్నారని వాదనలు లేకపోయా. కొత్త తరం యువతలో ఈ తప్పిద భావన కొనసాగుతోంది. వాస్తవాలు చంద్రబాబు అమలు, విస్తరణకు కీలక పాత్ర పోషించారని నిర్ధారిస్తాయి.
రాజీవ్ గాంధీ పునాది, చంద్రబాబు అమలు కలిసి హైదరాబాద్ విశ్వ ఐటీ కేంద్రంగా నిలిచింది. 2005 నాటికి 1,500 కంపెనీలు, లక్షలాది ఉద్యోగాలు ఏర్పడ్డాయి. ఐటీ రెవెన్యూ రూ.10,000 కోట్లకు చేరింది. ఇది రాష్ట్ర ఆర్థిక శక్తిగా మారింది.