Homeఆంధ్రప్రదేశ్‌Jagan Mohan Reddy: కాక్రోచ్ సరే.. నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ మాటేంటి జగన్?!

Jagan Mohan Reddy: కాక్రోచ్ సరే.. నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ మాటేంటి జగన్?!

Jagan Mohan Reddy: దేశంలోనే నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం పెద్ద వివాదమే రేపింది. చివరకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా విద్యార్థి లోకం పోరాటం చేసింది. జనతా కాక్రోచ్ ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదు. అయితే ఈ ఉద్యమం వెనుక ఎన్డీఏ వ్యతిరేక రాజకీయ పక్షాల మద్దతు ఉంది. ఆ పార్టీల ప్రోద్బలంతోనే ఆ ఉద్యమం సక్సెస్ అయ్యింది. దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్డీఏ వ్యతిరేక పక్షాలు, రాజకీయ పార్టీలు స్పందించాయి. ఏపీలో ఎన్డీఏ వ్యతిరేక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనిపై నోరు తెరవలేదు. కనీసం మాట్లాడలేదు. డీఎస్సీలో అక్రమాలు అంటూ నానా హంగామా చేస్తున్న ఆ పార్టీ.. నీట్ ప్రశ్న పత్రాల విషయంలో ఎందుకు స్పందించలేదు అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి కోపం వస్తుందని.. ఓ అరుదైన అవకాశాన్ని మాత్రం ఆ పార్టీ జారవిడుచుకుంది.

* ఇప్పటికీ స్పందన లేదు..
దేశవ్యాప్తంగా ఇప్పుడు జనతా కాక్రోచ్ ఉద్యమం ఫలితం చర్చ జరుగుతోంది. తమ పార్టీని కూడా జనతా కాక్రోచ్ తో కొద్ది రోజుల కిందట పోల్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ ఉద్యమం నేపథ్యం, విద్యార్థులతో పాటు నిరుద్యోగులు చేస్తున్న పోరాటం విషయంలో మాత్రం స్పందించలేకపోయింది. దీనిపైన ఇప్పుడు జాతీయస్థాయిలో చర్చ నడుస్తోంది. జనతా కాక్రోచ్ ఉద్యమం పై రాజకీయ పార్టీల ప్రభావం లేదు కానీ.. భారతీయ జనతా పార్టీ హవాను తగ్గించేందుకు ఇటువంటి ఉద్యమాలు రావాలని కోరుకున్నాయి ఇతర రాజకీయ పార్టీలు. తెర వెనుక మద్దతు ఇవ్వడంతోనే ఇంత పెద్ద ఉద్యమం విజయవంతం అయింది. కానీ ఈ ఉద్యమం తెర వెనుక కూడా మద్దతు ఇవ్వకపోగా కనీసం స్పందించిన దాఖలాలు లేవు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.

* డీఎస్సీ పై బురద..
నీట్ ప్రశ్న పత్రాలు లీకేజీ వ్యవహారం తర్వాతనే డీఎస్సీ నియామక ప్రక్రియపై దృష్టి పెట్టింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడో ఏడాది కిందట డీఎస్సీ నిర్వహణ జరిగింది. దాదాపు 16 వేల మందికి పైగా ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు. ఏడాది పాటు విద్యా బోధన కూడా పూర్తి చేసుకున్నారు. అయినా సరే ఆ ఉపాధ్యాయుల నియామకం సక్రమంగా జరపలేదని టిడిపి కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఆరోపణలు చేసింది. కానీ నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం అనేది వాస్తవంగా జరిగిన దానిపై కనీస స్థాయిలో స్పందించలేదు. పొరుగున తెలంగాణలో స్నేహితుడైన కేటీఆర్ స్పందించారు కానీ జగన్మోహన్ రెడ్డి దానిపై స్పందించలేదు. పైగా తమ వైసిపి పోరాటాలను జనతా కాక్రోచ్ ఉద్యమాలతో పోల్చుకున్నారు. ఇప్పుడు జగన్ వైఖరి పైనే జాతీయ స్థాయిలో చర్చ నడుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Vijay

Vijay: విజయ్ తర్వాత తమిళ్ ఇండస్ట్రీ లో నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకునేది ఆయనేనా…

Vijay: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మొన్నటి వరకు విజయ్ నెంబర్ వన్ హీరోగా ఉండేవాడు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు వెళ్లిపోయాడు. కాబట్టి తను సినిమాలు చేసే అవకాశామైతే లేదు. ఇక రీసెంట్...
Nara Lokesh

Nara Lokesh: సాక్షి.. పాడిందే పాట.. లోకేష్ మీద తేల్చుకోవాల్సింది కోర్టులో..

Nara Lokesh: ఒక తప్పు జరిగింది. ఆ తప్పును ఆధారాలతో సహా నిరూపించాలి అంటే మన దగ్గర దమ్ము ఉండాలి. అన్నిటికి మించి సాక్షాలు ఉండాలి. ఆ తర్వాత కోర్టు దాకా వెళ్లాలి....
August School Holiday

August School Holidays: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు..!

August School Holidays: సాధారణంగా విద్యార్థులకు సెలవులు అంటే చాలా ఇష్టం. పాఠశాలలకు వరుసగా సెలవులు వస్తున్నాయంటే వారిలో సరదా వేరు. అటువంటి సరదా తెచ్చింది ఆగస్టు నెల. ఒకటి కాదు రెండు...
Delhi Protests

Delhi Protests: సీజేపీ నిరసనల వెనుక రెజీమ్‌ చేంజ్‌ వ్యూహాలు.. అలర్ట్‌ కాకుంటే ఆ దేశాల గతే!

Delhi Protests: ఢిల్లీలో ఇటీవల జరిగిన నిరసనలు కేవలం సాధారణ ప్రజా ఉద్యమం కాదని, వ్యవస్థీకృత రెజీమ్‌ చేంజ్‌ ప్రయత్నంగా చూడాల్సిన అవసరం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శాంతియుత మార్గాల ద్వారా...
Bhogapuram Airport

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం పై రీల్స్.. ఏపీ ప్రభుత్వం సంచలనం!

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం పై రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. పాఠశాల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు.. ఈనెల 26 నుంచి విద్యార్థులకు రకరకాల పోటీలు...
Oktelugu Epaper